Private Faculty (imagecredit:twitter)
తెలంగాణ

Private Faculty: ప్రైవేట్ టీచర్స్‌పై ప్రెజర్.. యాజమాన్యాలు వేధిస్తున్నాయంటూ ఫ్యాకల్టీ ఆవేదన !

Private Faculty: రాష్ట్రంలో వచ్చే నెలలో నూతన విద్యాసంవత్సరం ప్రారంభంకానున్నది. తమ స్కూల్స్, కాలేజీల్లో చేరాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులను కలుస్తూ యాజమాన్యాలు ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నాయి. అయితే, విద్యార్థులను చేర్పించాలని ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లపై యాజమాన్యాలు తీవ్రంగా ప్రెజర్ పెడుతున్నాయి. ఒక్కో టీచర్‌కు టార్గెట్ విధిస్తూ యాజమాన్యాలు భారీస్థాయిలో ఫీజు దండుకుంటున్నది. అయినా ఆ ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు, ఇతర ఫ్యాకల్టీకి మాత్రం వేసవి సెలవులకు సంబంధించిన వేతనాలు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. వేసవి వస్తే కుటుంబ పోషణకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు తెలంగాణలోని అన్ని ప్రైవేట్ యాజమాన్యాల తీరు ఇలాగే ఉందని చెబుతున్నారు. తెలంగాణలోని పలు ప్రైవేట్ యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా స్కూల్స్, కాలేజీలు కొనసాగుతున్నారు. అనుమతి ఒకచోట నిర్వహణ మరోచోట నిర్వహిస్తున్న దాఖలాలు సైతం ఉన్నాయి. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా యాజమాన్యాల తీరు మారడం లేదు. వేసవి సెలవుల్లో పని చేయించుకుని మరీ వేతనాలు ఇవ్వడం లేదని ఫ్యాకల్టీ ఆరోపణలు చేస్తున్నారు.

Also Read: Hari Hara Veera Mallu: అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఇక సర్దుకోండమ్మా!

వేసవిలో స్కూల్స్, కాలేజీలకు రమ్మని పిలిచి.. అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి తేవడంతో పాటు ఏప్రిల్, మే నెల వేతనాలు ఇవ్వటం లేదని వాపోతున్నారు. వేతనాలు లేకుండా కుటుంబ పోషణ తీవ్ర భారమై అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని, ప్రభుత్వం, అధికారులు ఇలాంటి అంశాలపై దృష్టిసారించి తమకు వేతనం కేటాయించేలా ఉత్తర్వులు జారీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

న్యాయం చేయాలని వేడుకోలు

ప్రైవేట్ యాజమాన్యాల తీరుపై ఇప్పటికే ఇంటర్ బోర్డు అధికారులను తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ఫెడరేషన్ సభ్యుల బృందం కలిసి విజ్ఞప్తి చేసింది. తమకు న్యాయం చేయాలని కోరింది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న వేతనాలతో జీవనం లాగిస్తున్న ప్రైవేట్ లెక్చరర్లకు రెండు నెలలు జీతం ఇవ్వకపోవడంతో దయనీయ పరిస్థితి ఏర్పడింది. ప్రైవేట్ యాజమాన్యాలు కావాలనే వేసవిలో వేతనాలు ఇవ్వకుండా ఆపుతున్నారని ఇంటర్ బోర్డు దృష్టికి ఫ్యాకల్టీ తీసుకెళ్లారు.

ఇలాంటి చర్యలను ఆపాలని అధికారులను కోరారు. తమ సంక్షేమం గురించి కాస్త ఆలోచించాలని, తమకు 12 నెలలు జీతం ఇచ్చేలా చొరవ చూపాలని కోరారు. వేసవిలో అడ్మిషన్ల పేరుతో విద్యార్థులను ఎక్కువ మందిని చేర్పించాలని టార్గెట్ విధించడంపైనా దృష్టిసారించాలని, అలాంటి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లపై భవిష్యత్ లో అయినా ఈ ప్రెజర్ తగ్గుతుందా? లేదా? అనేది చూడాలి.

Also Read: CM Revanth: విద్యుత్ శాఖలో విప్లవాత్మక మార్పులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

 

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!