Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా విడుదల తేదీ అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా, ఈసారి పక్కాగా థియేటర్లలోకి రానుంది. కారణం ఏమిటో అందరికీ తెలుసు. ఇంతకు ముందు అనౌన్స్ చేసిన డేట్స్‌కి ఈ సినిమా రాకపోవడానికి కారణం కూడా అందరికీ తెలుసు. కేవలం రెండండే రెండే రోజులు పవన్ కళ్యాణ్ చేయాల్సిన షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో, ఇప్పటి వరకు చెప్పిన డేట్స్‌కి ఈ సినిమాను మేకర్స్ విడుదల చేయలేకపోయారు. కానీ ఆ రెండు రోజుల షూట్‌ని పవన్ కళ్యాణ్ పూర్తి చేసి, ప్రస్తుతం ‘ఓజీ’ (OG Movie) షూట్‌లోకి అడుగుపెట్టారు. అంతే, ‘హరి హర వీరమల్లు’ను చకచకా రెడీ చేసి, థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు దర్శకుడు జ్యోతికృష్ణ ఎంతగానో కృషి చేస్తున్నారు.
Also Read- Naveen Chandra: నా ప్రతి సినిమాకు 10 మందైనా పెరగాలి.. అదే నా గోల్!
వాస్తవానికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మేకర్స్ పూర్తి చేసుకుంటూ వచ్చారు. తాజాగా జరిగిన రెండు రోజుల షూటింగ్‌కు సంబంధించిన ఫీడ్‌ని మాత్రమే యాడ్ చేయాల్సి ఉందని, ఆ పనుల్లో దర్శకుడు జ్యోతికృష్ణ (AM Jyothi Krishna) నిమగ్నమై ఉండటంతో.. నిర్మాత ధైర్యంగా విడుదల తేదీని ప్రకటించారు. ‘హరి హర వీరమల్లు’ సినిమా జూన్ 12న థియేటర్లలోకి రాబోతోందని తెలుపుతూ, అధికారికంగా మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ విశేషమైన స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇక అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మూడవ గీతాన్ని ట్రైలర్‌తో పాటు విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ట్రైలర్ విడుదలతో ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు చేరుకుంటాయని చిత్రయూనిట్ నమ్మకంగా ఉంది.
Also Read- Anasuya: పెళ్లికాకపోయి ఉంటే.. ఆ స్టార్ హీరోతో డేటింగ్ చేసేదాన్ని!
ఈ సినిమాను మే నెలలో విడుదల అని చెప్పినప్పుడు.. మే లో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఎప్పుడైతే, ‘హరి హర వీరమల్లు’ రావడం లేదని తెలిసిందో.. ఆ సినిమాలన్నీ విడుదలయ్యాయి. ఇప్పుడు జూన్‌లో విడుదల కావాల్సిన సినిమాలపై ‘హరి హర వీరమల్లు’ ఎఫెక్ట్ పడనుంది. ఈ సినిమా విడుదలకు వారం ముందు, వారం తర్వాత రిలీజ్‌కు ఉన్న సినిమాలన్నీ సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐపీఎల్ కారణంగా జూన్‌కు వాయిదా వేసుకున్న సినిమాలకు ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ రూపంలో మరోసారి బ్రేక్ పడనుంది. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో.. పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ స్థాయిలో జూన్ 12న బాక్సాఫీస్ వద్ద గర్జించనుంది. ఎ.ఎం. రత్నం (AM Rathnam)సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు