Naveen Chandra
ఎంటర్‌టైన్మెంట్

Naveen Chandra: నా ప్రతి సినిమాకు 10 మందైనా పెరగాలి.. అదే నా గోల్!

Naveen Chandra: యంగ్ హీరో నవీన్ చంద్ర నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఎలెవెన్’ (Eleven Movie). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుందర్ సి వద్ద ‘కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్’ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో.. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేయగా.. రుచిర ఎంటర్‌టైన్‌మెంట్ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి ఫ్యాన్సీ ధరకు థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర హీరో నవీన్ చంద్ర మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Robinhood OTT: ఓటీటీలో ‘రాబిన్‌హుడ్‌’ రాకింగ్..! అస్సలు ఊహించలేదు కదా!

‘‘ఈ సినిమాకు ‘లెవన్’ అనే టైటిల్ కథ నుంచే పుట్టింది. సినిమా చూసినప్పుడు అది అందరికీ అర్థమవుతుంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాను. తమిళ్ లో షోస్ పడ్డాయి. యునానిమాస్‌‌గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన వారంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. మేము అనుకున్న ట్విస్ట్‌లు, టర్న్స్, అడ్రినల్ రష్ మూమెంట్స్ సినిమా చూస్తున్నవారిని ఎగ్జయిట్ చేస్తున్నాయి. ఆడియన్స్ రెస్పాన్స్ పట్ల చాలా హ్యాపీగా వున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ దొరికిందని అంటున్నారు. ఇప్పటి వరకూ ఏ థ్రిల్లర్‌లో రాని ఒక డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్ ఈ సినిమాలో వుంది. ఆడియన్స్‌కి అది సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ప్రతి దానికి లాజిక్ వుంటుంది. అలాగే ఇందులోని ట్విస్ట్‌లని ముందుగానే డీకోడ్ చేయడం కష్టం.

ఇది మంచి రైటింగ్ బలం వున్న సినిమా. తెలుగు, తమిళ్ రెండు భాషల్లో సినిమా చేయడానికి దాదాపు ఆరు నెలలు సినిమా ప్రీ ప్రొడక్షన్ చేశాం. ఈ సినిమా చూస్తున్నపుడు విజువల్‌గా ఓ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నిర్మాతలు అలా ఖర్చు చేశారు. ఇది డైరెక్టర్, టెక్నికల్ ఫిల్మ్. లోకేష్ సినిమాని అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన వారంతా డైరెక్టర్ గురించి, రైటింగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్‌గా వుంటుంది. రెండు భాషల్లో డిఫరెంట్ డిఫరెంట్ షాట్స్ తీశాం. స్క్రిప్ట్‌ని కూడా ట్రాన్స్‌లేట్ చేయలేదు. తెలుగు నుంచి ప్రత్యేకంగా రైటర్‌‌తో రాయించి తెలుగు స్క్రిప్ట్‌తో షూట్ చేశాం. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ చేయడం ఇప్పుడు అడ్వాంటేజ్‌గా భావిస్తున్నా. ఈ సినిమాకి తమిళ్ డబ్బింగ్ నేనే చెప్పాను. నాకు ఎనిమిది భాషలు వచ్చు. నా అన్ని సినిమాలకి ప్రతి భాషలో నేనే డబ్బింగ్ చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తాను.

Also Read- Jayam Ravi: కెనీషాతో కలిసి ఉండటంపై వివరణ ఇస్తూ.. జయం రవి సంచలన లేఖ

బిగినింగ్ డేస్‌లో ఒక క్యారెక్టర్ నుంచి బయటపడటం నాకూ కొంచెం సమస్యగా వుండేది. షూటింగ్ తర్వాత కూడా ఆ క్యారెక్టర్‌ని ఇంటి వరకూ తీసుకెళ్ళే వాడిని. అయితే పెళ్లి తర్వాత దానిని మెల్లమెల్లగా మానుకున్నాను. షూటింగ్‌లో ఉన్నంత వరకే డైరెక్టర్ డిజైన్ చేసే క్యారెక్టర్‌లో వుంటాను. తర్వాత స్విచ్ఛాఫ్ చేసేస్తాను. నా ప్రతి సినిమాకి పది మంది ఆడియన్స్ అయినా పెరగాలనే ఉద్దేశంతో నా పాత్రలను ఎన్నుకుంటూ ఉంటాను. ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’లో విలన్‌గా చేస్తున్నాను. ‘అరవింద సమేత’ చూసి రవితేజానే నన్ను ఈ పాత్రకు రిఫర్ చేశారు. నా లుక్ చాలా బాగుంటుంది. ఇంకా కరుణ్ కుమార్ చేస్తున్న ‘హనీ’లో చేస్తున్నాను. ఇంకా ‘కాళీ’ అనే యాక్షన్ సినిమా, హరితో ఓ సినిమా చేస్తున్నాను. తమిళ్‌లోనూ ఓ సినిమా చేస్తున్నాను’’ అని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?