Robinhood OTT
ఎంటర్‌టైన్మెంట్

Robinhood OTT: ఓటీటీలో ‘రాబిన్‌హుడ్‌’ రాకింగ్..! అస్సలు ఊహించలేదు కదా!

Robinhood OTT: యంగ్ హీరో నితిన్ (Nithiin), డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ ఫిల్మ్ ‘రాబిన్‌హుడ్’ (Robinhood). ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై, మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా మేకర్స్ కూడా భారీగా ఖర్చు పెట్టారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ని కూడా ఇందులో నటింపజేశారు. ఎన్ని చేసినా, కంటెంట్‌లో దమ్ము లేకపోవడంతో.. ఈ సినిమాను ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోలేదు. కానీ, ఓటీటీలో మాత్రం ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ భావించినట్లుగానే.. ‘రాబిన్‌హుడ్’ ఓటీటీలో రాకింగ్ పెర్ఫార్మెన్స్‌తో దూసుకెళుతున్నాడు. అవును.. ఈ విషయం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న జీ5 ఓటీటీ(Zee5 OTT) సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Also Read- Vachinavaadu Gautam Teaser: ధర్మం దారి తప్పినప్పుడు.. ఏ అవతారం రానప్పుడు.. వచ్చినవాడే!

మే 10 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సినిమా అప్పుడే 50 మిలియన్స్‌కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో ‘రాబిన్‌హుడ్’ దూసుకుపోతుందని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇంతకు ముందు ఇదే ఓటీటీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ‘సంక్రాంతి వస్తున్నాం’ తరహాలోనే ఓటీటీలోకి వచ్చిన ‘రాబిన్‌హుడ్’ చిత్రం కూడా మంచి స్పందనను రాబట్టుకోవడంతో, మేకర్స్ హ్యాపీగా ఉన్నారు. థియేటర్స్‌లో ఫెయిలైనా, ఓటీటీలో సక్సెస్ కొట్టామనే ఆనందంలో టీమ్ అంతా హ్యాపీ మూడ్‌లో ఉంది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఈ సినిమా టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. ముందు ముందు ఈ సినిమా కూడా జీ5 మరిన్ని రికార్డులను నెలకొల్పుతుందని జీ5 యాజమాన్యం భావిస్తోంది.

Also Read- Jayam Ravi: కెనీషాతో కలిసి ఉండటంపై వివరణ ఇస్తూ.. జయం రవి సంచలన లేఖ

‘రాబిన్‌హుడ్‌’ క‌థ విష‌యానికి వ‌స్తే (Robinhood Story Line).. రామ్ (నితిన్‌) ఓ అనాథ‌, తెలివైన యువ‌కుడు. అనాథశ్రమంలో ఎదురైన కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా త‌నొక రాబిన్‌హుడ్‌గా మారాల్సి వస్తుంది. అలా మారిన రామ్.. ధ‌న‌వంతుల నుంచి డ‌బ్బ‌ును దొంగిలించి అవ‌స‌ర‌మైన వారికి సాయం చేస్తుంటాడు. అనుకోకుండా అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ సామ్రాజ్యానికి రాజైన వ్య‌క్తితో రామ్ త‌ల‌ప‌డాల్సి వ‌స్తుంది. అక్క‌డి నుంచి రామ్ క‌థ ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపు తీసుకుంటుంది. నీరా (శ్రీలీల‌)కు సెక్యూరిటీగా వెళ్లిన రామ్, ఆమెను ఎలా ప్రేమలో దించాడు? ప్ర‌మాద‌క‌ర‌మైన దొంగ‌త‌నాలు, ప్రాణాంత‌క‌మైన స‌వాళ్ల‌ను ఎలా ఎదుర్కొన్నాడు? అంతా బాగుంద‌ని భావిస్తున్న త‌రుణంలో క‌థ‌లో వచ్చే ట్విస్ట్ ఏంటి? అప్పుడు రామ్‌, నీరా ఏం చేశారు? స‌మ‌స్య నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అసలా ట్విస్ట్ ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘రాబిన్‌హుడ్’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?