CM Revanth (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

CM Revanth: విద్యుత్ శాఖలో విప్లవాత్మక మార్పులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కారణంగా వచ్చే మూడేళ్లలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరగనుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో విద్యుత్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

గతేడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరుకుందని సీఎంకు అధికారులు తెలిపారు. 2024తో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగిందని చెప్పారు. 2025-26 లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు సీఎంకు చెప్పారు. 2034-35 నాటికి 31,808 మెగావాట్ల కు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

విద్యుత్ డిమాండ్ నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వచ్చే మూడేళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలు, రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్ పోర్ట్ ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.

భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్ గా మారబోతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లో డేటా సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్ షిప్ లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపైన హెచ్ఎండీఎ తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేసుకోవాలని అన్నారు.

విద్యుత్ లైన్ల ఆధునీకరణ పైన దృష్టి సారించాలని.. ఫ్యూచర్ సీటీ లో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీల్లేదని చెప్పారు. హై టెన్షన్ లైన్ల ను కూడా అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుందని చెప్పారు.

Also Read: Anasuya Bharadwaj: అనసూయలో ఈ యాంగిల్ కూడా ఉందా.. తొలిసారి చూస్తున్నామంటూ కామెంట్స్!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని.. సెక్రటేరియట్, నక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో ఆ స్మార్ట్ పోల్స్ ను తీసుకురావాలని సీఎం సూచించారు. 160 కిలో మీటర్ల ఔటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని చెప్పారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని పుట్ పాత్ లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు.

Also Read This: Konda Surekha: రాజకీయ దుమారం రేపిన కొండా సురేఖ వ్యాఖ్యలు.. మంత్రి క్లారిటీ!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ