Anasuya Bharadwaj: బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చి సత్తా చాటిన అతికొద్ది మంది నటీమణుల్లో అనసూయ ఒకరు. బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. తనదైన హోస్టింగ్ తో మంచి గుర్తింపు సంపాదించారు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటన పరంగా తన మార్క్ ఏంటో చూపిస్తున్నారు. అయితే సోషల్ మీడియా విషయానికి వస్తే ఆమెను ఎప్పుడూ వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఆమె పోస్ట్ చేసే గ్లామర్ ఫొటోలను నెటిజన్లు ఎప్పుడు తప్పుపడుతూనే ఉంటారు.
అయితే తొలిసారి ఆమె చేసిన పోస్ట్ కు సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గురువారం అనసూయ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె తన జన్మదిన వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లోని ఓ అనాథ శరణాలయానికి వెళ్లిన అనసూయ.. అక్కడ చిన్నారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. వారితో సరదాగా గడిపి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అను స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
అయితే అనసూయ నుంచి ఎప్పుడు పోస్ట్ వస్తుందా? ట్రోల్ చేద్దామా? అని కాచుకొని ఉండే కొందరు నెటిజన్లు.. అను పెట్టిన లేటెస్ట్ ఫొటోలు చూసి షాకవుతున్నారు. ఎప్పుడూ గ్లామర్ ఫొటోలను మాత్రమే షేర్ చేసే అను.. ఇలా అనాథలైన చిన్నారులతో దిగిన ఫొటోలను పంచుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. చాలా రోజుల తర్వాత మంచి పనిచేశావంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ‘ఓరి సాంబో ఇది రాస్కోరా’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇకపైనా ఇలాగే మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు.