Parrot Smuggling: రైలులో చిలుకలను స్మగ్లింగ్ చేస్తూ మహ్మద్ జాహిద్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. పశ్చిమ బెంగాల్ నుంచి వారణాసికి చిలుకలను అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని రైళ్వే పోలీసులు అరెస్టు చేశారు. మహమ్మద్ జాహిద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
అక్రమంగా తరలిస్తున్నట్టు
పశ్చిమ బెంగాల్(West Bengal) నుండి వారణాసి(Varanasi)కి మహ్మద్ జాహిద్(Mohammad Zahid) అనే వ్యక్తి రామ చిలుకలను అక్రమంగా తరలిస్తున్నాడు. దీంతో ముంస్తు సమాచారం అందుకున్న పోలీసులు తనికీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహ్మద్ జాహీద్ అనే వ్యక్తి పోలీసులకు అనుమాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు వెంటనే అతడి వద్దకు చేరుకొని తనీకీ చేసారు. తనికీలో అతని వద్ద ఉన్న సంచులలో 400 లకు పైగా రామ చిలుకలను అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ప్రస్థుతం మార్కేట్‌లో వాటి విలువ సుమారు లక్షల్లో ఉంటుందని పోలీసులు పేర్కోన్నారు.
Also Read: Allu Arjun: ప్లాప్ వచ్చిన తర్వాత బన్నీ చేసేది ఇదే.. అందుకే పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..
ఇరుకైన సంచులలో..
పశ్చిమ బెంగాల్ నుండి వారణాసికి తరలించడం వలన అక్కడి మార్కేట్‌లో వాటికి విలువ సుమారు లక్షల్లో ఉంటుంది. దీనివల్ల అతడికి మంచి ఆదాయం వస్తుందని ఈ పనిని ఎంచుకొని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇది అనువైన మార్గం అని పోలీసులు విచారలో తెలింది. ఇరుకైన సంచులలో చిలుకలను భందించి వాటిని అక్రమంగా రవాణా చేసినందుకుగాను అతడిపై వణ్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అతనిపై పోలీసులు కేసు నమెదు చేసి రిమాండుకు తరలించారు. అనంతరం చిలుకలకు వైద్యపరీక్షలు నిర్వహించి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
రైలులో చిలుకల స్మగ్లింగ్
పశ్చిమ బెంగాల్ నుంచి వారణాసికి చిలుకలను అక్రమ రవాణా చేస్తున్న మహమ్మద్ జాహిద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
400 చిలుకలు స్వాధీనం
అంతర్జాతీయ మార్కెట్ లో వీటి విలువ లక్షల్లో ఉంటుందని చెబుతున్న అధికారులు pic.twitter.com/mED1FIjO1N
— BIG TV Breaking News (@bigtvtelugu) January 7, 2026
Also Read: KTR: మున్సిపల్ ఎన్నికల్లో అలుగుడు గులుగుడు వద్దు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి : కేటీఆర్

