District Reorganization: జిల్లాల పునర్విభజన అంశం (District Reorganization) రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. కొత్తవి ఏర్పాటు చేస్తారా?, లేక, ఉన్న జిల్లాలనే మార్చుతారా?, మొత్తం జిల్లాల సంఖ్య పెరుగుతుందా, తగ్గుతుందా? అనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. గత మూడు రోజులుగా రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. మరోవైపు, విపక్ష పార్టీలు విమర్శలకు విమర్శలు, ఆరోపణలు కూడా మొదలుపెట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
6 నెలల్లో నిర్ణయం
జిల్లాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాల పునర్విభజనపై ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజల నుంచి సలహాలు తీసుకున్న తర్వాత, ఆరు నెలల్లో మార్పులు చేస్తామని సీఎం చెప్పారు. శాస్త్రీయంగా జిలాల విభజన చేస్తామని క్లారిటీ ఇచ్చారు. రాజులను తలపించేలా ఉందనే ఉద్దేశంతో రాచకొండను మారుస్తున్నామని అన్నారు. ప్రజల అభ్యంతరాలన్నింటినీ పరిష్కరిస్తామని, ఇందుకు సంబంధించి రిటైర్డ్ న్యాయమూర్తి, మాజీ అధికారులతో కమిటీ వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్థరహితంగా జిల్లాల విభజన చేశారని,
గతంలో జిల్లాల పునర్విభజన ఇష్టారాజ్యంగా చేశారని విమర్శించారు. కేవలం 5 మండలాలతో జిల్లా పరిషత్ ఏర్పాటు చేశారని విమర్శనాస్త్రాలు సంధించారు.
Read Also- KTR: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది.. కాంగ్రెస్ వైఫల్య పాలనపై కేటీఆర్ ఫైర్!
సికింద్రాబాద్, మల్కాజిగిరిపై కీలక వ్యాఖ్యలు
జిల్లాల పునర్విభజన అంశంపై ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘‘కొంతమంది సికింద్రాబాద్ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు. సికింద్రాబాద్ పేరు ఎక్కడ ఉంది?. నేను ఎక్కడ తీశాను?’’ అని సీఎం ప్రశ్నించారు. సికింద్రాబాద్ పేరు తీసేయలేదని, జీహెచ్ఎంసీలో భాగంగానే ఉందని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ డిస్ట్రిక్‌లోనే సికింద్రాబాద్ ఉందన్నారు. ఇక, మల్కాజిగిరిని తాము పెట్టలేదు.. తీయలేదని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Read Also- Private Hospitals: నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులు.. పర్మిషన్ ఒక చోట.. నిర్వహణ మరో చోట..!

