Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Kahesh Kumar Goud) పేర్కొన్నారు. సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయన్నారు. కానీ నేతలు మరింత కష్టపడాల్సిన అవసరం ఉన్నదన్నారు. అప్పుడే ప్రత్యర్ధుల డ్రామాల్లో మోసపోకుండా ఉండవచ్చని స్పష్టం చేశారు. ఆదివారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలోజూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికను ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను ఎప్పటికప్పుడు ప్రయోగించాలన్నారు.
నియోజకవర్గం అభివృద్దికి..
ముగ్గురు ఇన్ చార్జ్ మంత్రుల ఆదేశాల మేరకు గ్రౌండ్ లెవల్ లోని నేతలు సమన్వయంగా వర్క్ చేయాలన్నారు. ఈ మీటింగ్ లో ఏఐసీసీ(AICC) ఇన్ చార్జ్ మీనాక్షి(Meenakshi Natarajan), ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్(Viswanathan), మంత్రులు తుమ్మల, తదితరులు ఉన్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రేస్(Congress) పార్టీ ఎంతో ప్రాధాన్యతనిస్తుందని గతంలో అన్నారు. హైదరాబాద్(Hyderabada) జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) సైతం పక్కగెలవాలన్న ఆలోచనతో జూబ్లీహిల్స్ లో కోన్న అబివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు.
Also Read: Sivaji: మహాదేవ నాయుడు.. మరో పవర్‌ఫుల్ పాత్రలో శివాజీ!
రూ.2.16 కోట్ల వ్యయంతో..
ఆయన జూబ్లీహిల్స్ లోని ఎర్రగడ్డ డివిజన్(Erragadda Division) లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్ లో రూ.2.16 కోట్ల వ్యయంతో నటరాజ్ నగర్(Natraj Nagara), శంకర్‌లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్ వద్ద సీసీ రోడ్లకు, నటరాజ్ నగర్, బంజారా నగర్, కమ్యూనిటీ హాల్‌ల పునరుద్ధరణ కు మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పరుగెత్తిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాలికతో అడుగులు వేస్తు కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం సైతం పక్కా ప్రణాలికతో ముందుకు వెలుతుంది.
Also Read: Gadwal District: గద్వాల జిల్లాలో సమాచార హక్కు చట్టానికి తూట్లు.. పట్టించుకోని అధికారులు
