Sivaji: మహాదేవ నాయుడు.. మరో పవర్‌ఫుల్‌ పాత్రలో శివాజీ!
Sivaji as Mahadeva Naidu
ఎంటర్‌టైన్‌మెంట్

Sivaji: మహాదేవ నాయుడు.. మరో పవర్‌ఫుల్‌ పాత్రలో శివాజీ!

Sivaji: నటుడు శివాజీ (Actor Sivaji) సెకండ్ ఇన్నింగ్స్ మాములుగా లేదు. ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది. హీరోగా సరైన హిట్ లేని శివాజీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత మంచి హిట్స్, బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్నారు. మధ్యలో బిగ్‌బాస్‌ ఆయనకు మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ‘90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్ ఆయనని ప్రతి ఇంటికి మరింత చేరువ చేసింది. ఇక ‘కోర్ట్’ సినిమాలో అయితే ఆయన విశ్వరూపం చూపించారు. ఇప్పుడు మళ్లీ అలాంటి పాత్రే ఒకటి ఆయనను వరించింది. యూట్యూబ్‌ వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న యూట్యూబ్‌ సంచలనం షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) హీరోగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ప్రేమకు నమస్కారం’ (Premaku Namaskaram). ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ను ఇటీవల విడుదలై మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీలో శివాజీ నటిస్తున్నట్లుగా చెబుతూ.. ఆ పాత్ర విశేషాలను మేకర్స్ తెలియజేశారు.

Also Read- OG Movie: ‘ఓజీ’ మూవీ నేహా శెట్టి సాంగ్ వచ్చేసింది.. ఈ పాటను ఎలా మిస్ చేశారయ్యా?

స్పెషల్ వీడియో విడుదల

‘ప్రేమకు నమస్కారం’ సినిమాలో శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర పేరు ‘మహాదేవ నాయుడు’ (Sivaji as Mahadeva Naidu)గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ పేరు చూస్తుంటే ఇందులో ఆయనది ఓ పవర్‌ఫుల్‌ పాత్ర అనేది అర్థమవుతోంది. ఈ మహాదేవ నాయుడు పాత్రకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియోను గమనిస్తే.. ఇందులో శివాజీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనే విషయం తెలుస్తోంది. ‘ఖుషి’ ఫేమ్ భూమిక మరో ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏబీ సినిమాస్‌ పతాకంపై అనిల్‌ కుమార్‌ రావాడ, భార్గవ్‌ మన్నె గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్‌ లవ్ ఎంటర్‌టైనర్‌‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి వి. భీమ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లవ్‌ ఫెయిల్యూర్స్‌, లవ్‌ బ్రేకప్‌ అయిన వాళ్లంతా ఒక చోట చేరి మాట్లాడుకుంటున్న సంభాషణలు, వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్‌ తమకు ఎలా హ్యాండ్‌ ఇచ్చారో తెలిపే అని ఫన్నీ బాధలన్నీ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ఫైనల్‌గా ఫణ్ముఖ్‌ ఇది పాన్‌ ఇండియా ప్రేమ ప్రాబ్లమ్‌ అని చెప్పడం, మీరు అమ్మాయి దక్కలేదని మందుకు, సిగరెట్లకు పెట్టే డబ్బుతో కైలాసగిరి దగ్గర ల్యాండ్‌తో పాటు కారు కొనుక్కోవచ్చని చెప్పే సంభాషణలు.. నేటి యూత్‌కు, వాళ్ల ప్రేమకు కనెక్టింగ్‌గా ఉన్నాయి. ఈ ‘ప్రేమకు నమస్కారం’ అనే టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ వీడియో చాలా సరదాగా అనిపించింది.

Also Read- 80s Reunion Party: ‘80స్ రీ-యూనియన్ పార్టీ’కి ఒకే ఫ్లైట్‌లో చిరు, వెంకీ.. ఫొటో వైరల్!

శివాజీ నట విశ్వరూపం చూస్తారు

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఇదొక యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమని అన్నారు. ఈ చిత్రంలో యూత్‌తో పాటు అందరికి కనెక్ట్‌ అయ్యే అంశాలున్నాయని, ముఖ్యంగా నేటి యువత లవ్‌, బ్రేకప్‌లకు సంబంధించిన అంశాలను పూర్తి వినోదభరితంగా ఈ చిత్రంలో చూపించబోతున్నామని చెప్పారు. నేటి యువత బాగా కనెక్ట్‌ అయ్యే కథ ఇదని, ఈ చిత్రంలో నటుడు హీరో శివాజీ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమాలో మహాదేవ నాయుడుగా శివాజీ నట విశ్వరూపం చూస్తారని నిర్మాత తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..