మహబూబాబాద్ స్వేచ్ఛ: Seethakka on KCR: మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క వెల్లడించారు. గురువారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని లక్ష్మీనరసింహాపురం, కోడిపుంజుల తండా, మొట్ల తిమ్మాపురం, కోట గడ్డ, కొత్తగూడెం మండలం గాంధీనగర్ గ్రామాలలో అంతర్గత రోడ్లు, బ్రిడ్జిలు, పాఠశాలలలో వివిధ అభివృద్ధి పనులు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… బయ్యారం, కొత్తగూడ మండలాల్లో రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా శీతక్క మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేయకపోతే నేడు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సమంగా కొనసాగేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొదటి విడతలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తున్నామన్నారు. రానున్న మూడున్నర ఏళ్లలో రాష్ట్రంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించేందుకు ప్రభుత్వం నిర్విరామ కృషి చేస్తుందన్నారు. ఈనెల 31 లోగా విడతల వారీగా రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా అందే నగదును నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు.
Also Read: Viral News: తెలంగాణలో వింత పరిస్థితి.. అసలు విషయం తెలిస్తే.. ఔరా ఔరా అనాల్సిందే..
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు పావలా వడ్డీ రుణాలు అందించలేదని ఆరోపించారు. రైతులకు ఉచిత కరెంటు సైతం అందించలేదని గుర్తు చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, కుట్టు మిషన్లు, మహిళా క్యాంటీన్లు, ఫ్రీ బస్సు తోపాటు బస్సులకే మహిళలను ఓనర్లుగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. పంది పంపుల నుండి కొత్తగూడా బయ్యారం బంగారం మండలాలకు సాగునీళ్లు తెచ్చేందుకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కృషి చేస్తున్నారని కొనియాడారు.
పంది పంపుల నుండి ఈ మూడు మండలాలకు సాగు, తాగునీటిని తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ఇల్లందు ఎమ్మెల్యే కోరం, నేను కలిసి వెళ్తామన్నారు. ఈ మూడు మండలాల రైతుల పంట భూముల్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం కొత్తగూడ మండల కేంద్రంలోని గాంధీ నగర్ గిరిజన ఆశ్రమ సంక్షేమ ఉన్నత పాఠశాల, కాలేజీల్లో జగతి ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్లను పంపిణీ చేశారు. ఆసక్తితో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి సులువుతుందని విద్యార్థులకు సూచించారు. రైతు వేదికలో ఆడపిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, తద్వారా ఆడపడుచులు గౌరవప్రదంగా జీవించేందుకు దోహదపడతాయి పేర్కొన్నారు.
Also Read: HCA Fund Misuse: HCA లో ఘరానా మోసం.. ఈడీ విచారణలో సంచలన నిజాలు
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ… ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని తన నియోజకవర్గ పరిధిలో సుమారు 10 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. బయ్యారం పెద్ద చెరువును ఆధునికరించాలని, నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, రెవెన్యూ డివిజన్ అధికారి కృష్ణవేణి, సంబంధిత అధికారులు, బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి పాల్గొన్నారు.