Ponnam Prabhakar: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఈ సంఘటనపై తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు. కర్నూల్(Kurnool) లో జరిగిన బస్సు ప్రమాద సంఘటన దురదృష్టకరం చాలా బాధ కలుగుతుందని అన్నారు. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్నామని, ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆవేదన వకచక్తం చేస్తుందని అన్నారు. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వివరాలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశాలు జారీ చేశామని అన్నారు.
త్వరలో సమావేశం..
అటు ఆంధ్రప్రదేశ్(AP) రవాణా శాఖ మంత్రి, మరియు కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో టెలిఫోన్లో మాట్లాడడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్(AP), కర్ణాటక(Karnataka), తెలంగాణ(Telangana) మధ్య ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. త్వరలో ఆంధ్ర ప్రదేశ్(AP), కర్ణాటక(Karnataka), తెలంగాణ(Telangana) రవాణా శాఖ మంత్రులం రవాణా శాఖ కమిషనర్లు సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.
Also Read: Prabhas: ప్రభాస్, హను రాఘవపూడి సినిమా పోస్టర్ వచ్చేసింది.. టైటిల్ ఏంటంటే?
స్పీడ్ లిమిట్ వలన..
స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుందని ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తామని అన్నారు. బస్సులపై రోజువారి రవాణా శాఖ చెక్ చేస్తే వేధింపులు అంటున్నారు.. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశా(Odisha)లో రిజిస్ట్రేషన్ అయింది. హైదరాబాదు(Hyderabad) నుండి బెంగళూరు(Bangalore) తిరుగుతుంది. మృతుల కుటుంబాలకు మా సానుభూతి వ్యక్తం చేస్తున్నామని, క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరాంమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
కర్నూల్ లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది
మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్న..
బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి గారు వివరాలు తెలుసుకోవడం జరిగింది
తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి,… pic.twitter.com/LrveQHLJsO
— Ponnam Prabhakar (@Ponnam_INC) October 24, 2025
Also Read: Jagan on Balakrishna: ఎంతపెద్ద మాట సార్.. బాలకృష్ణపై జగన్ షాకింగ్ కామెంట్స్!.. కౌంటర్ ఇస్తాడా?
