KTR fires on BRS: జిల్లాల పునర్విభజనపై కేటీఆర్ స్పందన
KTR (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

KTR fires on BRS: జిల్లాల పునర్విభజనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KTR fires on BRS: జిల్లాలను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు

ఆయా జిల్లాల ప్రజలతో అగ్గి రాజేస్తాం… ప్రజలతో కలిసి పోరాడుతాం
ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ఇంటి ముందటికి రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు
అందుకే జిల్లాలను రద్దు చేస్తామని రెవెన్యూ మంత్రి అంటున్నాడు
ఒక్క జిల్లాను రద్దు చేసినా కాంగ్రెస్‌పై పోరాటం తప్పదు
పాలమూరు రైతాంగాన్ని ఎండబెట్టేందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కన పెట్టిండు రేవంత్ రెడ్డి
రెండు సంవత్సరాలలో ఒక్క వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీతో లబ్ధి జరగలేదు
మహబూబ్ నగర్ పట్టణంలో జరిగిన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ జిల్లాలను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా (KTR fires on BRS) ఖండించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి జిల్లాలను రద్దు చేస్తామని, పాత జిల్లాలు శాస్త్రీయంగా లేవంటూ సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. జిల్లాలను రద్దు చేస్తే ఎవ్వరూ ఊరుకోరని కేటీఆర్ హెచ్చరించారు. కలెక్టర్లను, జిల్లా ఎస్పీలను ప్రజల వద్దకు తీసుకువచ్చి పాలనా ఫలాలు అందిస్తే సహించలేక, ప్రజలకు అందుతున్న అభివృద్ధి ఫలాలను చూడలేకనే జిల్లాలను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందన్నారు. తెలంగాణలోని ఏ జిల్లాను రద్దు చేసినా అక్కడ అగ్గి పుట్టిస్తామని, ప్రజలతో కలిసి ప్రభుత్వం పైన తీవ్రంగా పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. జిల్లాలను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ గారు ప్రజల వద్దకు పరిపాలన, అభివృద్ధిని తీసుకుపోయే విధంగా పరిపాలన వికేంద్రీకరణను చేపట్టారు. అందుకే తాండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో పాటు నూతన మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు జిల్లా యంత్రాంగం అంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని, కలెక్టర్లు, ఎస్పీలు ప్రజల మధ్య ఉండాలన్న సదుద్దేశంతో చిన్న జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది.

Read Also- Manchu Manoj: రాకింగ్ స్టార్ ప్రారంభించిన సంక్రాంతి పండుగ సంబ‌రాల క్యాంపెయిన్‌ వివరాలివే..

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రేవంత్ రెడ్డి కావాలనే పక్కన పెట్టారని కేటీఆర్ విమర్శించారు. లక్షలాది ఎకరాలకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వడంతో వలస పోయిన ప్రతి మహబూబ్ నగర్ బిడ్డ తిరిగి వచ్చారని కేటీఆర్ అన్నారు. కానీ మహబూబ్ నగర్ బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కావాలనే అడ్డుకుంటున్నారన్నారు. 30 వేల కోట్ల రూపాయలతో 90% పనులు పూర్తి చేసినా, కనీసం మిగిలిపోయిన 10% పనులు పూర్తి చేయలేక కావాలని ఆపుతున్నారన్నారు. కేవలం కేసీఆర్ కి పేరు వస్తుందన్న దురుద్దేశంతో, తమ పాత బాస్ చంద్రబాబుకి కోపం వస్తుందన్న ఏకైక కారణంతోనే ఈ రెండు సంవత్సరాలలో పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నారన్నారు. కనీసం రైతన్నలకు యూరియా బస్తాలు ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం, రైతన్నలకు మంచి చేసి మహబూబ్ నగర్‌ను సస్యశ్యామలం చేస్తామని చెప్తే ఎవరు నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు. 17వ తేదీన పాలమూరుకు వస్తున్న ముఖ్యమంత్రి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు.

గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన పదుల సంఖ్యలో పరిశ్రమలన్నీ తిరిగి ఎందుకు వెళ్లిపోయాయో పాలమూరు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ రెండు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమనైనా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్‌కు తీసుకువచ్చిందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రారంభించిన ఐటీ టవర్‌ని ఎందుకు పక్కన పెట్టారని కేటీఆర్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. 9,500 కోట్ల రూపాయలతో అమరరాజా వంటి భారీ పెట్టుబడులను తెలంగాణకు, ముఖ్యంగా మహబూబ్ నగర్‌కే తీసుకువచ్చామని కేటీఆర్ అన్నారు. కానీ రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్‌కు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. పెళ్లిళ్లకు, చావులకు వెళ్లడం తప్పించి ఎన్నికైన తర్వాత ప్రజలకు చేయడానికి మొన్నటి దాకా ఒక్క రూపాయి కూడా లేదు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్వయంగా చెబుతున్నారు అన్న విషయాన్ని మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకోవాలని కేటీఆర్ అన్నారు.

Read Also- Twist in Death Case: టెకీ ఆత్మహత్య కేసు దర్యాప్తులో నమ్మలేని నిజాలు.. ఎదురింటి కుర్రాడే క్రిమినల్!

కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అభివృద్ధి లేదన్నారు. మరోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆరు గ్యారెంటీలు.. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఉన్న పథకాలు పోయాయన్నారు. రైతుబంధు కేసీఆర్‌ 2 పంటలకు ఇస్తే.. రేవంత్‌ 3 పంటలకు ఇస్తానని రేవంత్ చెప్పాడు. వృద్ధులకు డబుల్ పెన్షన్ అన్నారు… కల్యాణ లక్ష్మికింద తులం బంగారం అని హామీ ఇచ్చారని, కానీ మేము ఆ రోజే చెప్పాము కాంగ్రెస్‌ బంగారమిచ్చే బ్యాచ్‌ కాదు.. పుస్తెలు ఎత్తుకుపోయే బ్యాచ్ అని కెటిఅర్ అన్నారు. పాలమూరు బిడ్డ రేవంత్‌కు బంగారం దొరకడం లేదా? ఉన్న హామీలే అమలు చేయడం చేతకాని రేవంత్… కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెబుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కోటి కోట్లు ఉన్నాయా? అబద్ధాలు ఆడినా అతికినట్టు ఉండాలి… కానీ రేవంత్ సిగ్గులేకుండా అబద్ధాలు ఆడుతున్నాడని విమర్శించారు.

రెండేళ్ల రేవంత్‌ పాలనలో ఏ వర్గానికి అభివృద్ధి ఫలాలు దక్కలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని కెటిఅర్ అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే… పంచాయతీలకి మంచినీళ్ల నుంచి మొదలుకొని పారిశుద్ధ్యం దాకా అన్ని రంగాల్లో కేసీఆర్ గారు అద్భుతమైన ప్రగతి సాధించేలా గ్రామాలను తీర్చిదిద్దారు. రెండు సంవత్సరాల కాలంలో ఉన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రేవంత్ పక్కన పెట్టాడని, ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీల అమలు గురించి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే రేవంత్ బూతులు తిడుతున్నాడన్నారు. అందుకే పంచాయితీ ఎన్నికల్లో బిఅర్ఏస్ వైపు ప్రజలు నిలిచారని కెటిఅర్ అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో ముందుకు పోవాలి, గట్టి విజయం సాధించాలి.

మహబూబ్ నగర్ ఎం.బి.సి గ్రౌండ్‌లో సర్పంచ్‌ల ఆత్మీయ అభినందన సభకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్‌లు వాల్యా నాయక్, ఆంజనేయులు గౌడ్, ఇంతియాజ్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Just In

01

Nenu Ready Teaser: 30 వేల జీతానికి ఇలాంటి దరిద్రపుగొట్టు జాబ్ ఎవడైనా చేస్తాడా?

Bhatti Vikramarka: వారికి గుడ్ న్యూస్.. జంట పెళ్లి చేసుకుంటే రెండు లక్షలు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

CM Revanth Reddy: త్వరలో ఈ కొత్త రూల్‌.. చలానా పడిందా? మీ ఖాతా నుంచి పైసలు కట్.. సీఎం రేవంత్ రెడ్డి !

Sharwanand: ‘శతమానం భవతి’.. ఆత్రేయపురంలో ‘నారీ నారీ నడుమ మురారి’!

Harish Rao: నల్లమల సాగర్ కు సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నీళ్ల శాఖ మంత్రిపై హరీష్ రావు ఫైర్!