KTR: పాలమూరు పై నిర్లక్ష్యం ఎందుకు?: కేటీఆర్
KTR (imagecredit:twitter)
Telangana News

KTR: పాలమూరు పై నిర్లక్ష్యం ఎందుకు?.. ఎన్ని రోజులు కాలం వెళ్ళదీస్తారు: కేటీఆర్

KTR: కాళేశ్వరం ప్రాజెక్టులో రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే నష్టమని, రాజకీయంగా తమకేం నష్టం ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. నీళ్లు ఇచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు. ఎవరు ప్రాజెక్టులు నిర్మించినా తాగునీటి అవసరాల పేరుతో నిర్మాణాలు ప్రారంభిస్తారని, ఆ తర్వాత అన్ని అనుమతులు తీసుకురావడం ఆనవాయితీ అని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ 70 ఏళ్ల నుంచి వింటున్నామని, కానీ ఇంకా పూర్తి కాలేదని చెప్పారు. కానీ, కాళేశ్వరంను కేసీఆర్ పాలనలోనే పూర్తి చేసినట్టు తెలిపారు. దీనికి కేవలం కేసీఆర్ నిబద్ధతని కారణమని, కాలంతో పోటీపడి ప్రాజెక్ట్ నిర్మించారని తెలిపారు. అసెంబ్లీలో సోమవారం కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. 45 టీఎంసీలకు ఒప్పుకుంటే పాలమూరు రంగారెడ్డికి నష్టం చేసినట్లే అని అన్నారు.

Also Read: Xiaomi 17 Ultra vs Google Pixel 10 Pro .. వీటిలో ఏ ఫోన్ బెస్ట్?

నీటిపారుదల శాఖపై చర్చ

299 టీఎంసీలు ఒప్పుకున్నది అప్పటి కాంగ్రెస్(Congress) ప్రభుత్వమేనన్నారు. దానిపైనే తమ ప్రభుత్వం మరిన్ని కేటాయింపుల కోసం అడిగినట్లు వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టును కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆ ప్రాజెక్ట్ నిర్మిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని కాలువలను కూడా తవ్వడం లేదని ఆరోపించారు. నీళ్ల సబ్జెక్ట్ నాలుగు రోజులు చదివితే రాదని, రాష్ట్రం పైన ప్రేమ ఉండాలని హితవు పలికారు. పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గొప్ప ఫలితాలు సాధించిందని కేటీఆర్ తెలిపారు. రెండేళ్లకే కాంగ్రెస్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదని ఆరోపించారు. నీటిపారుదల శాఖపై చర్చ అంటున్నారని దేని మీద పెడుతున్నారో తెలియది అన్నారు. కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారని, అందుకే ప్రిపేర్ అవుతున్నారన్నారు. సబ్జెక్ట్ లేనప్పుడు సభను ఎక్కువ రోజులు నడపలేరని సెటైర్లు వేశారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కేవలం డబ్బుల కోసమే చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ సిట్ అంటూ ఎన్ని రోజులు డ్రామాలు చేస్తారో చూస్తామని, అంతా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. విచారణలు, కేసుల పేరుతో సాధించిందేంటి అని ప్రశ్నించారు. కనీసం ఒక్కదాంట్లో అయినా నిజం ఉందని తేలిందా అని నిలదీశారు.

Also Read: Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?

Just In

01

Viral Video: ఫ్యాంటు జేబులో పేలిన మోటరోలా ఫోన్.. వీడియో వైరల్

Crime Report 2025: విశాఖలో పెరిగిన హత్యలు.. తగ్గిన అత్యాచారాలు.. క్రైమ్ రిపోర్టులో సంచలన లెక్కలు

Alleti Maheshwar Reddy: వాళ్లంతా కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Star Maa Parivaaram: డెమాన్ పవన్‌ను ముద్దులతో ముంచెత్తిన రీతూ చౌదరి.. బుజ్జి బంగారం అంటూ..

Zero Hour Assembly: రాష్ట్ర శాసనసభలో ‘జీరో అవర్’లో సందడి.. సూటిగా ప్రశ్నల వర్షం!