Vijay and Rashmika: విజయ్, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?
Vijay and Rashmika (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?

Vijay and Rashmika: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి ముచ్చట్లే వినిపిస్తున్నాయి. సెలబ్రిటీలంతా వరుసగా ఓ ఇంటివారవుతుండటంతో టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ సందడి మొదలైంది. తాజాగా అల్లు హీరో అల్లు శిరీష్ (Allu Sirish) తన పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, అంతకంటే హాట్ టాపిక్ ఏమిటంటే.. టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)ల పెళ్లికి కూడా ముహూర్తం ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ముందుగా అల్లు శిరీష్ విషయానికి వస్తే.. తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ, సోమవారం నాడు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు అల్లు శిరీష్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తన వివాహాన్ని 2011, మార్చి 6వ తేదీన చేసుకున్నారు. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, సరిగ్గా 15 ఏళ్ల తర్వాత 2026, మార్చి 6వ తేదీన తాను కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు శిరీష్ ప్రకటించారు. ఈ ప్రకటనతో అల్లు అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Also Read- Naa Anveshana: నా అన్వేషణ అన్వేష్‌పై ఫిర్యాదు.. ఇండియాకు వచ్చాడా.. ఇక అంతే!

విజయ్ – రష్మిక పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

ఇదే జోరులో విజయ్, రష్మికల పెళ్లి (Vijay Deverakonda Rashmika wedding) తేదీపై కూడా వార్తలు మొదలయ్యాయి. గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వ్యవహారం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం, వీరిద్దరూ రాబోయే కొత్త ఏడాదిలో (2026) ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం రహస్యంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెళ్లి తేదీ కూడా ఇదేనంటూ ఓ డేట్ వైరల్ అవుతోంది. వినిపిస్తున్న వార్తల ప్రకారం 2026, ఫిబ్రవరి 26న వీరి వివాహం జరగనుందట. ఇది ఒక గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఉండబోతోందని సమాచారం.

Also Read- ibomma Ravi Case: ‘ఐబొమ్మ రవి కేసు’.. సంచలన విషయాలు చెప్పిన సైబర్ క్రైమ్ డీసీపీ!

ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా..

రాజస్థాన్‌లోని పర్యాటక కేంద్రమైన ఉదయపూర్, ఈ స్టార్ కపుల్ వివాహానికి వేదిక కాబోతున్నట్లు తెలుస్తోంది. రాజసం ఉట్టిపడే ప్యాలెస్‌ల మధ్య అత్యంత సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో విజయ్ – రష్మికలు ఏడడుగులు వేయబోతున్నారట. ఇప్పటికే వెడ్డింగ్ ప్లానర్స్ ఈ పనుల్లో నిమగ్నమైనట్లు టాక్. అయితే ఈ తేదీపై అటు విజయ్ గానీ, ఇటు రష్మిక గానీ ఇంకా అధికారికంగా నోరు విప్పలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా ఈ గుడ్ న్యూస్ చెబుతారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు అల్లు శిరీష్ మార్చిలో పెళ్లి పీటలు ఎక్కుతుంటే, అంతకంటే ఒక వారం ముందే విజయ్-రష్మికలు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త టాలీవుడ్‌లో హాట్ కేక్‌లా మారింది. ఫిబ్రవరి చివరలో మొదలయ్యే ఈ పెళ్లిళ్ల సందడి మార్చి వరకు కొనసాగనుంది. ఈ వార్త నిజమైతే మాత్రం 2026 ప్రారంభం టాలీవుడ్ అభిమానులకు పండగే అని చెప్పాలి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Cyber Crime Scam: ఖాకీలకే సైబర్​ క్రిమినల్స్ ఉచ్చు… ఏం చేశారంటే?

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి డేట్ కూడా ఫిక్సయిందా?

Spirit: ప్రభాస్, సందీప్ వంగా ఇవ్వబోయే న్యూ ఇయర్ ట్రీట్ ఇదేనా?

Mahabubabad News: ఎవరి మాటా వినడు.. సీతయ్యలా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి

Allu Arjun Fans: సీఎం రేవంత్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుచిత వ్యాఖ్యలు.. కేసు నమోదు