SLBC tragedy: 200 రోజుల దాటినా కేంద్ర, రాష్ట్రం స్పందనేది
ఎస్ఎల్బీసీ సొరంగం కూలడానికి కారణాలు రాబడతాం
కాంగ్రెస్ నిర్లక్ష్యంతో 6 మృతదేహాలు నేటికీ వెలికితీయలేదు
బాధిత కుటుంబాలకు పరిహారం అందించలేదు
ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తాం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం కూలి (SLBC tragedy) ఎనిమిది మంది కార్మికులు చనిపోయి 200 రోజులు దాటిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆరు మృతదేహాలను ఇప్పటికీ వెలికితీయలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Read Also- Ind Vs Pak Toss: టాస్ గెలిచిన పాకిస్థాన్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
‘అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురు బాధితుల మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయింది. కుటుంబాలకు ఎటువంటి పరిహారం కూడా చెల్లించలేదు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ ఘటనకు 200 రోజులు అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎస్ఎల్‌బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదని, ఒక్క ప్రశ్న కూడా ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నించారు.
Read Also- Ram Gopal Varma: ‘మిరాయ్’పై మరో ట్వీట్.. వర్మకి టాపిక్ దొరికిందోచ్!
‘బీజేపీ బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్‌ని ఎప్పుడూ కాపాడుతున్నారు? ఇది ఎలాంటి అపవిత్ర బంధం?’ అని కేటీఆర్ నిలదీశారు. ఏకంగా 6 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయి 200 రోజులు దాటినా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తామని, కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్సెల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు మేము సమాధానాలు రాబడతామని, ఇది బీఆర్ఎస్ వాగ్దానం అని స్పష్టం చేశారు.