Kishan Reddy: ఓట్ చోరీ పేరుతో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఆదివారం కాంగ్రెస్(Congress) నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. బీజేపీ ఇచ్చిన జవాబును ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్లమెంట్‌లో ఎలాగయితే భయపడి పారిపోయిందో, ఇక్కడ కూడా ప్రజలు కాంగ్రెస్ వితండవాదాన్ని పూర్తిగా తిరస్కరించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కేవలం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఓట్ చోరీ దుష్ప్రచారానికి తెరతీశారన్న విషయం ప్రజలకు అర్థమైందని తెలిపారు.
రాహుల్ గాంధీ ట్రిక్కులు
దాదాపు 100 ఓటములకు చేరువగా ఉన్న రాహుల్ గాంధీ తనను తాను నాయకుడిగా సమర్థించుకోవడానికి ఇలాంటి దుష్ప్రచారాలు కాకపోతే మరెలాంటి పనులు చేస్తారని ఎద్దేవా చేశారు. తన పార్టీ కార్యకర్తలను బిజీగా ఉంచడం ద్వారా, నాయకుడిగా తన వైఫల్యాలను ప్రశ్నించే వారు లేకుండా చేసుకోవడానికి మాత్రమే రాహుల్ గాంధీ ఇలాంటి ట్రిక్కులను చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ బల ప్రదర్శన కాంగ్రెస్ నాయకత్వం చేసిన ఒక అవమానకరమైన ప్రదర్శనగా పేర్కొన్నారు.
Also Read: Ustaad BhagatSingh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిమేక్ కాదా?.. మరి హరీష్ శంకర్ తీసింది ఏంటి?
ఎన్నికల కమిషన్‌లో..
దేశంతో కయ్యానికి కాలు దువ్వుతున్న విదేశీ శక్తులతో కలిసి రాహుల్ గాంధీ(Rahul Gandhi) దేశానికి చేస్తున్న ద్రోహాన్ని కప్పిపుచ్చడానికే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) బీజేపీ కార్యకర్తలను ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల కమిషన్‌లో ఒక్కో సభ్యుడిపై మాటల దాడిని కొనసాగించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi), రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న వారిని వారి విధులను నిర్వర్తించకుండా హిట్ లిస్(Hit List)ట్‌ను తయారు చేస్తున్నట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. రామ్ లీలా మైదానంలో మాట్లాడిన ఒక్కో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రామాయణంలో విలన్‌కు ఉన్న ఒక్కో తలను తలపించేలా ప్రవర్తించారని కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

