Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..
Sree Vishnu (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu) ఓ సజెషన్ చేశారు. శాకాహారుల కోసం ప్రత్యేకమైన రెస్టారెంట్లు చాలా అరుదుగా ఉంటాయి. ఇక ప్యూర్ వెజ్ రెస్టారెంట్లకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల వంటకాలతో, పసందైన రుచులతో శాకాహారుల్ని ఆకట్టుకునేందుకు నగరంలో ‘శుద్ద్ విలాస్’ ప్రారంభమైంది. మల్కాజ్‌గిరిలో ఈ న్యూ బ్రాంచ్‌ను సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు తన చేతుల మీదుగా ఓపెన్ చేశారు. ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ అన్ని రకాల వంటకాలను రుచి చూడటం విశేషం. అన్ని రకాల వెరైటీ వంటకాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణుతో పాటుగా నిర్వాహకులు శశికాంత్, శ్రీరామ్‌, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, దర్శకుడు శేఖర్ కమ్ముల, కోన వెంకట్, మల్కాజ్‌గిరి బ్రాంచ్ భాగస్వాములు రాజీవ్, రాజ శేఖర్, హుస్సేన్, వెంకట్ మార్తాండ్, తదితరులు పాల్గొన్నారు.

Also Read- Cyber Crime: రూ.1,000 కోట్ల సైబర్ స్కామ్.. నలుగురు చైనా పౌరులపై సీబీఐ ఛార్జ్‌షీట్.. 111 షెల్ కంపెనీలు బట్టబయలు

శాకాహారులకు ఇది ది బెస్ట్

ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించిన అనంతరం హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘నేటి అర్బన్, బిజీ లైఫ్ స్టైల్‌లో క్లీన్, క్వాలిటీ, హెల్దీ ఫుడ్‌కు ఎలాండి డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి ఫుడ్ దొరికితే ఎంతైనా ఖర్చు పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు. మరీ ముఖ్యంగా శాకాహార భోజనాన్ని ఇష్టపడే వారు.. ఎక్కువగా క్లీన్, క్వాలిటీ, హెల్దీ ఫుడ్‌ కోరుకుంటూ ఉంటారు. అందుకే శాకాహార రెస్టారెంట్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడలాంటి ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ప్రారంభించిన ‘శుద్ద్ విలాస్’ (Shuddh Vilas Restaurant) యాజమాన్యానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. శాకాహార ప్రియులందరికీ ఈ రెస్టారెంట్ హాట్ ఫేవరేట్‌గా మారుతుందని విశ్వసిస్తున్నాను. నేను కూడా అన్నీ టేస్ట్ చేసి చూశాను. చాలా బాగున్నాయి. శాకాహారులకు ఇది ది బెస్ట్ అని చెప్పగలను’’ అని అన్నారు.

Also Read- BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

భారతీయ పాక శాస్త్ర సంప్రదాయాల్లోనే

అనంతరం బ్రాండ్ టీమ్ శశికాంత్, శ్రీరామ్ మాట్లాడుతూ.. ఈ ‘శుద్ధ్ విలాస్’ రెస్టారెంట్‌ను భారతీయ పాక శాస్త్ర సంప్రదాయాల్లోని ప్రామాణిక శాకాహార వంటకాలను అందించే లక్ష్యంతో, స్వచ్ఛత, స్థిరత్వం, భోజన ప్రియుల సంతృప్తి కోసం రాజీలేని ప్రమాణాలను కొనసాగిస్తామని తెలిపారు. సమీప భవిష్యత్తులో బ్రాండ్‌ను ఇతర ప్రదేశాలకు కూడా విస్తరించే ప్రణాళికలో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా కూడా ఇక్కడి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించి, టేస్ట్ పరంగా ది బెస్ట్ అని చెప్పడం విశేషం. ఇక శ్రీ విష్ణు విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..