Kaleshwaram project: కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై (Kaleshwaram project) మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యంతరం వెలిబుచ్చారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి హరీష్‌రావు కూడా రిపోర్టును ఛాలెంజ్ చేశారు. ఈ మేరకు ఇరువురూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కేసీఆర్, హరీష్‌రావు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏది కావాలో.. కమిషన్ నివేదిక ఆ రకంగా ఉందని ఆరోపించారు. కమిషన్ నివేదికపై స్టే విధించాలని న్యాయస్థానాన్ని కోరారు.
Read Also- Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. కేబుల్ వైర్లపై స్పందించిన ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
ఇంతకీ రిపోర్టులో ఏముంది?
కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఓ అండ్ ఎం అవకతవకలకు కేసీఆరే బాధ్యుడు అని జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది. ఎవరెవరు ఏయే తప్పులు చేశారో కూడా నివేదికలో పేర్కొంది. రాజకీయ నాయకులతో పాటు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని వివరించింది. కాళేశ్వరం డిజైన్స్ ఆమోదంపై కమిషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. మోడల్ స్టడీ లేకుండానే డిజైన్స్‌ను సీడీవో ఆమోదించినట్టు నివేదిక చెప్పింది. నాణ్యత లేని నిర్మాణాలు, థర్డ్ పార్టీ పరిశీలన కూడా లేదని పేర్కొంది. ఆపరేషన్, నిర్వహణ లోపాలకు సీడీవో కారణమని తెలిపింది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు, మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్‌కే జోషి, నాడు సీఎంకు కార్యదర్శిగా వ్యవహరించిన స్మితా సబర్వాల్ తీరును కమిషన్ తప్పుబట్టింది. బిజినెస్ రూల్స్‌కు విరుద్ధంగా వీళ్లంతా వ్యవహరించారని తేల్చింది. నిపుణుల కమిటీ రిపోర్ట్‌ను ఎస్‌కే జోషి తొక్కి పెట్టారని, మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు, అప్పటి చీఫ్ ఇంజినీర్ హరిరాం కాంట్రాక్టుల విషయంలో వాస్తవాలు దాచారని తెలిపింది.
Read Also- ACB officials: ఏసీబీ వలకు చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.. ఎంత లంచం అడిగారంటే
నిజమైన ‘స్వేచ్ఛ’ కథనాలు!
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చోటుచేసుకున్న అవినీతిపై ‘స్వేచ్ఛ’ ఇప్పటికే సంచలన కథనాలు ప్రచురించింది. బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నంత గొప్పదేం కాదని, అనేక అవకతవకలు జరిగాయంటూ పక్కా ఆధారాలతో ఏడాదిన్నరగా ‘స్వేచ్ఛ’ పలు సంచలన కథనాలు పబ్లిష్ చేసింది. కాంట్రాక్టుల విషయంలో నాటి అధికారులు పోషించిన పాత్ర, కమీషన్ల కోసం నడిపించిన వ్యవహారాలు ఇలా అన్నింటినీ ప్రజల ముందుపెట్టింది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఈ సంచలన విషయాలు కనిపించాయి.
Read Also- Brahmanandam: నా దృష్టిలో అందమైన హీరో ఎవరో తెలుసా?.. బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు