KCR: పార్టీ నేతలతో అధినేత కేసీఆర్(KCR) తాజా రాజకీయాలపై ఆరా తీశారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం యశోద దవాఖాన(yashoda Hospital)లో కేసీఆర్ అడ్మిట్ అయ్యారు. కేసీఆర్ ను పలువురు పార్టీ నేతలు పరామర్శించేందుకు వెళ్లారు. వారితో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. నేతల మంచిచెడులను సైతం అడిగితెలుసుకున్నారు. వానాకాలం సాగు ప్రారంభం కావడంతో రైతులకు యూరియా లభ్యత, వ్యవసాయం, సాగునీరుపై ప్రధానంగా చర్చించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలపైనా ఆరా తీశారు. వార్తమాన అంశాలపైనా నేతలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నేతలు, ఉద్యమకారులు సైతం పలు అంశాలను ప్రస్తావించారు.
యూరియా సరఫరాలో కోత
కాంగ్రెస్(Congress) పాలనలో ప్రజలు ఏయే అంశాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను, నేతలు అనుసరించాల్సిన అంశాలను సూచించారు. శనివారం ఆసుపత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్చ్ అవుతున్నట్లు సమాచారం. రెండ్రోజుల్లో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, కేంద్ర ప్రభుత్వం(Central Govt) అనుసరిస్తున్న తీరు, యూరియా సరఫరాలో కోతపెట్టడాన్ని ఎత్తిచూపాలని భావిస్తున్నట్లు తెలిసింది. అదే విధంగా బనకచర్ల ప్రాజెక్టును ఏపీ నిర్మిస్తున్న తీరును ఎండగట్టనున్నట్లు సమాచారం. కృష్ణా, గోదావరిలో నీటి వాటాపై బీఆర్ఎస్(BRS) అనుసరించిన విధానాన్ని, కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులపై వ్యవహరిస్తున్న తీరును మీడియా వేదికగా ప్రజలకు వివరించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)తో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఉన్నారు.
Also Read: Gujarat lawyer: వామ్మో ఇదేందయ్యా ఇది.. జడ్జి ముందే బీర్ కొట్టిన లాయర్.. వీడియో వైరల్!
ఆసుపత్రిలోనే కేసీఆర్ నేడు డిశ్చార్జ్
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్(KCR) ఆరోగ్యంపై కేటీఆర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగా గురువారం సాయంత్రం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారన్నారు. ఆయన బ్లడ్ షుగర్ , సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం ఒకటి రెండు రోజులు ఆస్పత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారన్నారు.వారి సూచన మేరకు అడ్మిట్ అయ్యారన్నారు. శనివారం డిశ్చార్జ్ అవుతున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆరోగ్యం సమాచారం అడుగుతూ ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని కేటీఆర్ తెలిపారు.
Also Read: Congress vs CPI: కొత్తగూడెం కుడా చైర్మన్ కోసం కాంగ్రెస్ సిపిఐ మధ్య వార్!