KCR: నేడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్‌!
KCR (imagecredit:twitter)
Telangana News

KCR: నేడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్‌!

KCR: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశాన్ని నేడు పార్టీ అధినేత కేసీఆర్(KCR) అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎంపీ(MP)లు, ఎమ్మెల్సీలు(MLC), ఎమ్మెల్యే(MLA)లు పాల్గొననున్నారు. ఇప్పటికే వారికి సమాచారం సైతం ఇచ్చారు. అయితే, ఈ సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలకు ఏ అంశాలపై దిశా నిర్దేశం చేస్తారనేది ఆసక్తి నెలకొంది. ప్రజా సమస్యలపై పార్టీ పోరుబాట పట్టబోతుందని, అందులో భాగంగానే తొలుత ఇరిగేషన్(Irrigation) అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుంది.

జిల్లాలో సభలు

రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదని, రైతులకు ఒక ఎకరాకు నీరు అందించలేదని, వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru Rangareddy Project)పై ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని ఇప్పటికే విమర్శలు ఎక్కుపెట్టిన గులాబీ పార్టీ, కేసీఆర్‌తో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలో సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. ఎప్పుడు నిర్వహించాలనే దానిపై కేసీఆర్ నేడు నిర్వహించే సమావేశంలో క్లారిటీ ఇవ్వబోతున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

Also Read: Narendra Modi: ల్యాండింగ్ సాధ్యపడక, వెనక్కి వెళ్లిపోయిన ప్రధాని మోదీ హెలికాప్టర్.. కారణం ఏంటంటే?

రాజకీయ వర్గాల్లో ఆసక్తి

ప్రజా సమస్యలపై ఎలా స్పందించాలి, పార్టీ కమిటీలు, ప్రజా ప్రతినిధులు చేయాల్సిన అంశాలపై దిశా నిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం, రాబోయే ఎంపీటీసీ(MPTV) జెడ్పీటీసీ(ZPTC) ఎన్నికలతో పాటు మున్సిపల్ కార్పొరేషన్‌లలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇంకా ఏ అంశాలపై కేసీఆర్ ప్రస్తావిస్తారనేది అటు పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

నంది‌నగర్‌కు కేసీఆర్ 

ఎర్రవెల్లిలోని తన నివాసం నుండి శనివారం సాయంత్రం నందినగర్‌లోని నివాసానికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. పలువురు నేతలతో భేటీ అయినట్లు సమాచారం. పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలిసింది.

Also Read: Gurram Papireddy: ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా..

Just In

01

Kishan Reddy: స్పీకర్ ఏ రకంగా తీర్పు ఇస్తున్నారో అర్థం కావట్లేదు?: కిషన్ రెడ్డి

Task Force: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళన చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ

Cyber Crime: వేల కోట్లు కొట్టేస్తున్న సైబర్ క్రిమినల్స్ ముఠా.. పల్లెల్లో బ్యాంక్ ఖాతాలు తీసి..!

Godavari Water Dispute: ఆగని జల కుట్రలు.. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో మరో భారీ కుట్రకు తెరలేపిన ఏపీ ప్రభుత్వం..?

KCR: నేడు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్‌!