Gurram Papireddy: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. రీసెంట్ గా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన “గుర్రం పాపిరెడ్డి” సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ మీట్ ను ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ వేణు సద్ది మాట్లాడుతూ – ఇది సక్సెస్ మీట్ కన్నా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పే మీట్ అనుకుంటున్నా. “గుర్రం పాపిరెడ్డి” సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. అన్నారు.
Read also-Pade Pade Song: సంగీత ప్రియులను కట్టి పడేస్తున్న ఆది సాయికుమార్ ‘శంబాల’ నుంచి పదే పదే సాంగ్..
ప్రొడ్యూసర్ అమర్ బురా మాట్లాడుతూ.. నేను ఈ సినిమా చేయడానికి సపోర్ట్ గా నిలిచిన వారు వేణు, సంధ్య, జయకాంత్. వారు లేకుంటే “గుర్రం పాపిరెడ్డి” సినిమా మీ ముందుకు వచ్చేది కాదు. ఇది థ్యాంక్స్ మీట్ గానే భావిస్తున్నాం. సక్సెస్ మీట్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుతా. మా సినిమాలో ఫరియా, నరేష్, రాజ్ కుమార్, వంశీ కామెడీకి ప్రేక్షకులు బాగా నవ్వుతున్నారు. అలాగే మా సినిమాలోని ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెబుతున్నారు. మ్యూజిక్, ఆర్ట్ వర్క్, విజువల్స్..ఇలా అన్నీ క్వాలిటీగా ఉన్నాయనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. నా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు. ప్రొడ్యూసర్ జయకాంత్.. మా “గుర్రం పాపిరెడ్డి” సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనతో పాటు రివ్యూస్ పాజిటివ్ గా వస్తున్నాయి. టికెట్స్ కావాలనుకునే వారికి మా ప్రొడక్షన్ నుంచి నేను అరెంజ్ చేస్తాను. అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్.. మా సినిమాకు నిన్నటి నుంచి వస్తున్న రెస్పాన్స్ ఈ వారం మొత్తం మీ దగ్గర నుంచి కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
యాక్టర్ వంశీధర్ కోసిగి మాట్లాడుతూ – “గుర్రం పాపిరెడ్డి” సినిమా ఫ్రెష్ కంటెంట్ తో వచ్చింది. ఇలాంటి కొత్త తరహా చిత్రాలని ఆదరిస్తే మరిన్ని మంచి మూవీస్ వస్తాయి. అన్నారు. యాక్టర్ రాజ్ కుమార్ కసిరెడ్డి.. మా సినిమాకు అందరి దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. అయినా మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ టెన్షన్ పడుతున్నారు. మంచి సినిమాకే మంచే జరుగుతుంది. అన్నారు. డైరెక్టర్ మురళీ మనోహర్, అవతార్ రిలీజ్ వల్ల మా మూవీకి మార్నింగ్ షోస్ స్లోగా మొదలయ్యాయి. మ్యాట్నీ నుంచి పికప్ అయి, సాయంత్రానికి థియేటర్స్ లో 90 పర్సెంట్ ఆక్యుపెన్సీ వచ్చింది. ఒక చిన్న సినిమాకు ఈవినింగ్ కు థియేటర్స్ కు ప్రేక్షకులు అంత సంఖ్యలో రావడం మేము సంతోషపడే విషయమే. ఈ వీకెండ్ లో మా సినిమా మరింత ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాం. ఈ రోజు థియేటర్స్ విజిట్ కు ఆర్టిస్టులందరితో కలిసి వెళ్తున్నామని అన్నారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.. ప్రేక్షకులతో పాటు నేనూ థియేటర్ లో ఫుల్ మూవీ చూశాను. నేను నా సినిమాలైనా ఒక క్రిటిక్ గా సినిమాను చూస్తా. మేము బాగా పర్ ఫార్మ్ చేశామనే అనిపించింది. అన్నారు. హీరో నరేష్ అగస్త్య.. “గుర్రం పాపిరెడ్డి” సినిమాకు రెస్పాన్స్ చాలా బాగుంది. బుక్ మై షో లో బుకింగ్స్ ఎంకరేజింగ్ గా ఉన్నాయి. నిన్న మ్యాట్నీ షోస్ నుంచే 90 పర్సెంట్ థియేటర్స్ ఫిల్ అవుతున్నాయి. చిన్న సినిమాకు ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగుంటే ఎంత మంచి క్వాలిటీతో స్క్రీన్ మీదకు వస్తుంది అనేది గుర్రం పాపిరెడ్డి సినిమా ప్రూవ్ చేసింది. మా డైరెక్టర్ మురళీ గారు ఎంతో ప్యాషనేట్ గా ఈ సినిమాను రూపొందించారు. నాకు ప్రమోషన్స్ లో కొంచెం మొహమాట పడతాను. ఫరియా వల్లే మేము ఈ సినిమాకు మంచి ప్రమోషన్స్ చేయగలిగాం. మా సినిమాకు ఇదే రెస్పాన్స్ కంటిన్యూ చేస్తూ మూవీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

