BC Bandh: బీసీ రిజర్వేషన్లపై చేపట్టిన బంద్‌లో ఎమ్మెల్సీ కవిత కుమారుడు ఆదిత్య పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్న కవిత కుటుంబ సభ్యులు ఒక్కసారిగా బంద్‌లో పాల్గొనడం, ప్లకార్డులు ప్రదర్శించడం, మీడియాతోనూ మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కవిత రాజకీయ వారసుడు ఆదిత్యనేనా అనేది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీసింది.
జాగృతితో యాక్టివ్.. ఆదిత్య తొలి అడుగు
బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత రాజకీయంగా స్పీడ్ పెంచారు. జాగృతి బలోపేతంపై దృష్టి సారించారు. ఒక వైపు కమిటీలను నియమించడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాట బాట పట్టారు. అందులో భాగంగానే ఈ నెల 25 నుంచి జాగృతి జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకు ఏర్పాట్లలో జాగృతి శ్రేణులు నిమగ్నమయ్యారు. ఈ తరుణంలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై శనివారం బీసీ జేఏసీ రాష్ట్ర బంద్ నిర్వహించింది. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి మద్దతు తెలుపడంతోపాటు ఖైరతాబాద్(Khairathabad)లో మానవహారం నిర్వహించారు. రోడ్డుపై కవిత బైఠాయించారు. అయితే, ఆమె కుమారుడు ఆదిత్య(Aditya) సైతం బంద్‌లో పాల్గొన్నాడు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాడుతాం అని ప్లకార్డు ప్రదర్శించాడు. బీసీల న్యాయమైన హక్కు రిజర్వేషన్లు అని పేర్కొన్నాడు. దీంతో రాజకీయంగా ఆదిత్యకు తొలి అడుగు పడిందా అనే చర్చ మొదలైంది.
Also Read: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఉద్యమం కకావికలం.. కీలక నేతలు లొంగుబాటు!
గతంలో కేటీఆర్ కొడుకు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కొడుకు హిమాన్షు తెగ హడావుడి చేశాడు. సేవా కార్యక్రమాలపై స్పందించాడు. మొక్కలు నాటుతూ, పాఠశాలల్లో సమస్యలపై స్పందిస్తూ ప్రజలకు సుపరిచితం అయ్యాడు. ఈ క్రమంలో ప్రజల్లో ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఆ సమయంలో కేటీఆర్ రాజకీయ వారసుడిగా గుర్తింపు పొందాడు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత సైలెంట్ అయ్యాడు. అయితే, ఊహించని విధంగా కవిత కుమారుడు తాజాగా ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుందనేది హాట్ టాపిక్ అయింది. కవిత కావాలని ఆదిత్యను తీసుకొచ్చి పరిచయం చేశారా? ఇంతకాలం సైలెంట్‌గా ఉండి ఇప్పుడే తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యమేంటనేది ఇప్పుడు విస్తృత చర్చకు దారి తీసింది.
సామాజిక బాధ్యత నేర్పాలనే ఉద్దేశం
బీసీ బంద్ కార్యక్రమంలో తన కుమారుడు పాల్గొనడంపై కవిత స్పందించారు. కేవలం సామాజిక బాధ్యత నేర్పే క్రమంలోనే తన కొడుకును బీసీ బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చానని చెప్పారు. బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నామంటే తానూ పాల్గొంటానని అన్నాడన్నారు. మన ఇంటి నుంచే సామాజిక బాధ్యత నేర్పాలనే ఉద్దేశంతోనే బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చానని చెప్పారు. తన కొడుకు వయసు చిన్నదని, ఇప్పుడే రాజకీయాలు ఏమీ లేవని చెప్పారు.
Also Read: Crime News: హుజురాబాద్‌లో దారుణం.. ఐటీఐ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య
