Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో కల్వకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కీలక ప్రకటన చేశారు. బీసీల కోసం జాగృతి తరపున యుద్ధ భేరి మోగించబోతున్నట్లు కవిత ప్రకటించారు. బీసీ కులగణనపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు లెక్కలు చెప్పిందన్న కవిత.. కేంద్రం సైతం బీసీలను అవమానించిందని ఆరోపించారు. జనవరి 29న బీసీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నట్లు కవిత ప్రకటించారు.
జాగృతి కార్యాలయంలో జెండా వందనం అనంతరం కవిత మాట్లాడుతూ.. సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తితో ముందుకు సాగాలని కవిత చెప్పారు. బీసీ కులగణనపై బీజేపీ కొత్త మోసానికి తెర లేపిందని కవిత విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం బీసీ కులగణనపై తప్పుడు లెక్కలు చెప్పిందని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేయబోయే కులగణనపై ఇన్నాళ్లు నమ్మకం పెట్టుకున్నామన్న కవిత.. కానీ కులగణన డాక్యుమెంట్ లో బీసీ అనే కాలమ్ లేకపోవడం వెనుకబడిన వర్గాలను అవమానించడమేనని కవిత అన్నారు. బీసీ ఉప కులాలను లెక్కించాలని తెలంగాణ జాగృతి తరపున డిమాండ్ చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు.
బీసీ కులగణనకు సంబంధించి ఇవాళ దేశంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ మరొసారి కొత్త మోసానికి తెరలేపారు. కేంద్రం తీసుకువచ్చిన సెన్సస్ డాక్యుమెంట్ లో బీసీ కాలమ్ పెట్టలేదు. బీసీలల్లో ఉన్న ఉపకులాలను లెక్కపెట్టాలని తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం బీసీ కాలమ్… pic.twitter.com/3b9hzwZ6pR
— Telangana Jagruthi (@TJagruthi) January 26, 2026
Also Read: Republic Day – 2026: ‘ఆపరేషన్ సింధూర్ శకటం’.. దిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో ఆసక్తికర దృశ్యాలు!
బీసీల కులగణనకు సంబంధించి మేధావులతో మాట్లాడుతున్నట్లు కవిత చెప్పారు. ఇందులో భాగంగా జనవరి 29వ తేదీన బీసీలు, బీసీ ఉప కులాలు, సంచార జాతులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి కులం, ఉప కులం ఎంత శాతం ఉంది అనే దానిపై డాక్యుమెంట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి జాగృతి తరపున సమర్పిస్తామని కవిత స్ఫష్టం చేశారు. 2011లో కాంగ్రెస్ బీసీలను మోసం చేసినట్లు.. ఇప్పుడు 2026లో బీజేపీ బీసీలను మోసం చేయాలని చూస్తోందని కవిత ధ్వజమెత్తారు. కేంద్రం ప్రభుత్వ ప్రయత్నాలను జాగృతి ఆధ్వర్యంలో తిప్పికొట్టాలని కవిత పిలుపునిచ్చారు.

