Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ పోలీసులు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)కు షాక్ ఇచ్చారు. ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ (Chinna Srisailam Yadav), బాబాయ్ రమేశ్ యాదవ్ (Ramesh Yadav)లను బైండోవర్ చేశారు. దాంతోపాటు నియోజకవర్గంలోని మరో వంద మందికి పైగా రౌడీషీటర్లపై కూడా ఇవే చర్యలు తీసుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఎలాగైనా విజయం సాధించాలని అన్ని ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చిన్న శ్రీశైలం యాదవ్‌తో పాటు వంద మందికి పైగా రౌడీషీటర్ల (rowdy-sheeters)ను బైండోవర్ చేశారు.
కేసులు నమోదయితే కఠిన చర్యలే
అత్యధికంగా బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో 74 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. మధురానగర్ స్టేషన్ పరిధిలో చిన్న శ్రీశైలం యాదవ్‌తోపాటు అతడి సోదరుడు రమేశ్ యాదవ్‌తో సహా 19 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు జరుగుతున్న అసెంబ్లీ పరిధిలోని రౌడీ షీటర్లపై పోలీసులు నిఘాను పెంచారు. అయితే ఈ ఉప ఎన్నికల వేళ.. వీరిపై కేసులు నమోదు అయితే మాత్రం పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
