Crime News: సంచలనం సృష్టించిన రియల్టర్ హత్య కేసులో ఆరుగురు నిందితులను జవహర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఓ మైనర్ఉండటం గమనార్హం. నిందితుల నుంచి ఓ పిస్టల్, ఏడు బుల్లెట్లు, ఓ తపంచా, ఒక లైవ్ బుల్లెట్, రెండు వేట కొడవళ్లు, మొబైల్ ఫోన్లు, ఆటో, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాకేత్ కాలనీకి చెందిన వెంకట రత్నం రియల్ఎస్టేట్ వ్యాపారి. మూడు రోజుల క్రితం కూతురిని స్కూల్‌లో దింపి బైక్‌పై తిరిగి వస్తుండగా దారిలో అడ్డగించిన దుండగులు వేట కొడవళ్లతో విచక్షణారహితంగా నరికారు. దాంతోపాటు కాల్పులు కూడా జరిపారు. దీంతో వెంకట రత్నం అక్కడికక్కడే మరణించాడు. కేసులో ప్రధాన నిందితుడు, ఒకప్పటి డాన్‌గా పేరు తెచ్చుకున్న రౌడీషీటర్సుధేశ్ సింగ్ కుమారుడైన చందన్‌సింగ్ (33)ను విచారించగా పలు సంచలన వివరాలు వెలుగు చూశాయి. సుధేశ్డాన్గా ఉన్న సమయంలో వెంకట రత్నం అతని వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో సుధేశ్‌కు వారసత్వంగా వచ్చిన ఆస్తుల వివరాలన్నీ తెలుసుకున్నాడు.
Also Read: Crime News: దొంగతనమే వృత్తిగా 17 నేరాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు
పగతోనే పక్కా ప్లాన్
సుధేశ్ ఎన్‌కౌంటర్ తరువాత ఆ ఆస్తులను వెంకట రత్నం తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దీంతో చందన్ సింగ్, వెంకట రత్నం మధ్య ఆస్తి వివాదాలు తలెత్తాయి. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారిన వెంకట రత్నం తన తండ్రి ఎన్‌కౌంటర్‌కు కారణమయ్యాడని చందన్ సింగ్‌కు తెలియడంతో అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సహచరులతో కలిసి రెక్కీ జరిపి, వెంకట రత్నం ప్రతీ రోజూ కూతురిని స్కూల్‌వద్ద దింపటానికి ఒంటరిగా వెళుతుంటాడని నిర్ధారించుకున్నాడు. ఈ క్రమంలోనే స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా రత్నం బైక్‌ను ఆటోతో ఢీకొట్టి అడ్డగించాడు. ఆ వెంటనే సహచరులతో కలిసి వేట కొడవళ్లతో నరికి, నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. జవహర్‌నగర్ స్టేషన్ సీఐ సైదయ్య ఆధ్వర్యంలో గాలింపు జరిపి చందన్ సింగ్, కామారపు నరేశ్ కుమార్ (28), వడ్డే వెంకట నారాయణ (35), నంద్యాల పవన్ కుమార్ (20), నర్సింగ్‌తో పాటు ఓ మైనర్‌బాలుడిని అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్చేశారు.
Also Read: Crime News: సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. పెళ్లి చేస్తామని పిలిచి.. యువకుడి దారుణ హత్య

