Jagga Reddy on Pawan Kalyan: పవన్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్
Jagga Reddy on Pawan Kalyan (Image Source: twitter)
Telangana News

Jagga Reddy on Pawan Kalyan: సినిమాలోనే కాదు.. బయటా యాక్టింగే.. పవన్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

Jagga Reddy on Pawan Kalyan: ఏపీ రాజకీయాలపై తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) పైనా మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) విషయంలో ఈ ముగ్గురు నేతలు ఇన్ని డ్రామాలు ఆడుతుంటే ఆంధ్రా ప్రజలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఎందుకు గమనించడం లేదని నిలదీశారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి గత కొన్నేళ్లుగా వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి దీనిపై స్పందించారు. ప్రధానంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్సంబంధాలు ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ సమస్యకు ఇంతవరకూ పరిష్కారం లభించలేదని జగ్గారెడ్డి విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ బయట కూడా యాక్టింగే చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. ఎండగడతాం, పొడుస్తాము అన్నారు ఏమైంది? అంటూ నిలదీశారు.

Also Read: Sankranti Holidays 2026: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులు ఫిక్స్.. ఏపీ కంటే తక్కువే!

నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు రెండుసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ సమస్యకు ఇంకా పరిష్కారం రాకపోవడంపై జగ్గారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తీరును సైతం ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు, పవన్, జగన్ ముగ్గురు కలిసి స్టీల్ ప్లాంట్ విషయంలో దారుణమైన యాక్టింగ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. మోదీ వద్దకు వెళ్లి వీరెవరూ గట్టిగా అడిగే ప్రయత్నం చేయకపోవడం వల్లనే కార్మికులు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని జగ్గారెడ్డి అన్నారు. స్టీల్ కార్మికులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకుండా కేంద్రానికి వత్తాసు తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్రా ప్రజలు దీనిపై ఏం ఆలోచన చేస్తున్నారంటూ నిలదీశారు. ఆంధ్రులు ఇంకేం ఐక్యంగా ఉన్నారని ప్రశ్నించారు.

Also Read: Nagababu Comments: శివాజీ vs అనసూయ.. నాగబాబు ఎంట్రీ.. దుర్మార్గులంటూ ఫైర్

Just In

01

GHMC: జీహెచ్ఎంసీలో విలీనమై 60 సర్కిళ్లుగా 12 జోన్లుగా ఏర్పాటు.. సరికొత్త పరిపాలనకు సర్కారు శ్రీకారం!

Sandhya Theatre Case: ఛార్జ్‌షీట్‌లో అల్లు అర్జున్ పేరు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం

Operation Aaghat 3.0: దిల్లీలో స్పెషల్ ఆపరేషన్.. 24 గంటల్లో 660 మందికి పైగా అరెస్టు.. ఎందుకంటే?

Prakash Raj: మహిళలపై శివాజీ చేసిన వ్యాఖ్యలు అహంకారంతో కూడినవి.. నటుడు ప్రకాష్ రాజ్

Mysuru Palace: మైసూరు ప్యాలెస్ దగ్గర హీలియం సిలిండర్ పేలుడు.. ముగ్గురు మృతి