Sankranti Holidays 2026: తెలంగాణ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంక్రాంతి సెలవులపై కీలక అప్డేట్ బయటకొచ్చింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ దాదాపు 7 రోజులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది మేలో విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ లో జనవరి 11 నుంచి 15 వరకూ ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. అయితే జనవరి 10 రెండో శనివారం రావడంతో దానిని కూడా పరిగణలోకి తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో సంక్రాంతి సెలవులపై అధికారిక ప్రకటన జారీ చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం.
సెలవుల మంజూరు ఇలా..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జనవరి 10న రెండో శనివారం సెలవు, 11న ఆదివారం కావడంతో సాధారణ సెలవు లభించనుంది. ఇక 12 నుంచి 16వ తేదీల వరకూ సంక్రాంతి సెలవులను లభించనున్నాయి. జనవరి 14న బోగి, 15న సంక్రాంతి, 16న కనుమ సందర్భంగా పాఠశాలలకు సెలవులు మంజూరు చేయనున్నారు. మెుత్తంగా చూస్తే 7 రోజుల పాటు విద్యార్థినీ, విద్యార్థులకు వరుసగా సెలవులు లభించనున్నాయి.
Also Read: Bangladeshi Singer: బంగ్లాదేశ్‌లో మరింత రెచ్చిపోయిన మూకలు.. ప్రముఖ సింగర్ షోపై అకస్మిక దాడి
ఏపీలో 9 రోజులు..
మరోవైపు ఏపీలో జనవరి 10 నుంచి 18వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 10వ తేదీన రెండో శనివారం రావడం, 11వ తేదీన ఆదివారం రావడం, తిరిగి 18వ తేదీన మళ్లీ ఆదివారం రావడంతో సంక్రాంతి సెలవులకు కలిసొచ్చింది. దీంతో ఏపీలో సెలవు రోజులు భారీగా పెరిగిపోయాయి. జనవరి 12న (సోమవారం) ఎలాంటి ప్రత్యేకత లేకపోయినా విద్యాశాఖ సెలవు మంజూరు చేసింది. అలాగే 13న బోగీ, 14న సంక్రాంతి, 15న సంక్రాంతి సందర్భంగా ఎప్పటిలాగే సెలవులు ఇచ్చారు. ఇక 16, 17 తేదీల్లోనూ ప్రత్యేకత లేనప్పటికీ తిరుగు ప్రయాణాలను దృష్టిలో పెట్టుకొని విద్యాశాఖ సెలవులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

