Social Welfare Gurukul Schools: రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పార్ట్ టైం టీచింగ్, నాన్ టీచింగ్ జెంట్స్ స్టాఫ్ ను తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వారి స్థానంలో లేడీ స్టాఫ్ ను నియమించాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. మహిళా స్టాఫ్‌ను నియమించాలనుకోవడం మంచి నిర్ణయమే అయినప్పటికీ పార్ట్ టైం టీచింగ్, నాన్ టీచింగ్ జెంట్స్ స్టాఫ్ ను తొలగించాలనుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇన్ని రోజులుగా రెగ్యులర్ సిబ్బందికి దీటుగా కష్టపడ్డ తమకు దక్కిన ఫలితమేంటని పలువురు పార్ట్ టైం టీచింగ్, నాన్ టీచింగ్ జెంట్స్ స్టాఫ్ ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్ణయంతో దాదాపు 6 వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడే అవకాశముందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ కుటుంబ పోషణ కష్టమవుతుందని, అందుకే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టీచింగ్ నాన్ టీచింగ్
తెలంగాణలోని ఏ గురుకులాల పాఠశాలలో లేనటువంటి రూల్స్ ను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అమలుచేయడంపై పార్ట్ టైం టీచింగ్, నాన్ టీచింగ్ జెంట్స్ స్టాఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లో పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్లు ఏసీటీలు, పీఈటీలు, హెల్త్ సూపర్ వైజర్లు పనిచేస్తున్నారు. కానీ అన్ని గురుకులాల కంటే భిన్నంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మాత్రం ప్రతి ఏటా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ని మారుస్తూ ఉండడం ఆనవాయితీగా మారిపోయిందని పలువురు సిబ్బంది చెబుతున్నారు. అధికారుల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఇది నిదర్శనమని వాపోతున్నారు. అధికారుల నిర్ణయంతో ఈ ఏడాది పనిచేసిన సిబ్బంది మరో విద్యాసంవత్సరంలో విధులు నిర్వర్తిస్తారో? లేదో? అనే అపనమ్మకంతో బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నట్లుగా చెబుతున్నారు.
Also Read: Serilingampalli: నకిలీ పత్రాలతో వేరొకరి స్థలంలో బిల్డింగ్ నిర్మాణం.. భవనం సీజ్!
జెంట్స్ స్టాఫ్ కు బదులు లేడీ స్టాఫ్
సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పార్ట్ టైం టీచింగ్, నాన్ టీచింగ్ జెంట్స్ స్టాఫ్ కు బదులు లేడీ స్టాఫ్ ను రిక్రూట్ చేసుకునేందుకు ఈనెల 29 నుంచి డెమో సైతం నిర్వహించనున్నట్లుగా పలువురు సిబ్బంది చెబుతున్నారు. అయితే పార్ట్ టైం టీచింగ్, నాన్ టీచింగ్ జెంట్స్ స్టాఫ్ ను అబ్బాయిల గురుకులాలకు మారుస్తామని అధికారులు వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. కానీ వాటిలో ఇప్పటికే సరిపడా స్టాఫ్ ఉండటంతో వీరిని ఎలా అలాట్ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. ఇతర గురుకులాల్లో లేని నిబంధనలు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలోనే ఎందుకనే ప్రశ్నలను పలువురు సిబ్బంది లేవనెత్తుతున్నారు. ఇతర గురుకులాలతో పోలిస్తే వేతనాలు కూడా తక్కువగానే చెల్లిస్తున్నారని వారు వాపోతున్నారు. గత ఏప్రిల్ లో పనిచేసిన టీచింగ్ స్టాఫ్ కి ఇప్పటివరకు వేతనాలు కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పార్ట్ టైం టీచింగ్, నాన్ టీచింగ్ జెంట్స్ స్టాఫ్ మొరను అధికారులు ఆలకిస్తారా? లేడీ స్టాఫ్ ను రిక్రూట్ చేసినా.. మరోచోట పార్ట్ టైం టీచింగ్, నాన్ టీచింగ్ జెంట్స్ స్టాఫ్ ను అలాట్ చేసి వారి జీవితాలు రోడ్డున పడకుండా జాగ్రత్తలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.
Also Read: Chatanpally Railway Stataion: చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!