Indiramma Houses9image credit;swetcha reporter)
తెలంగాణ

Indiramma Houses: అర్హతను బట్టి ఇందిరమ్మ ఇల్లు.. మంత్రి సంచలన వాఖ్యలు!

Indiramma Housesప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లు నిర్మించాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. అర్హతను బట్టి ఇందిరమ్మ ఇల్లు వస్తుందని, ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కలెక్టర్ మను చౌదరి తో కలిసి 144 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేసి ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించారు.

Also Read: Chamala Kiran Kumar: కవితకు కాంగ్రెస్ నేత ఆఫర్.. అలా చేస్తే కలిసి వస్తా.. ఎంపీ చామల

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, అర్హత ను బట్టే ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మొదటి విడుతగా 3,500 ఇండ్లు మంజూరు చేసామన్నారు. పది సంవత్సరాల తర్వాత ఇండ్లు వస్తున్నాయని ఎవరు ఆందోళన పడవలసిన అవసరం లేదన్నారు. సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు పేదలకు అందిస్తున్నమన్నారు. తనను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదని నేరుగా కలవవచ్చన్నారు.

గౌరెల్లి ప్రాజక్టు పనులు పూర్తి చేస్తాం…

గౌరెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లోని శుభం గార్డెన్ లో జిల్లా వ్యవసాయ ఉద్యానవన శాఖ ఆయిల్ ఫెడ్,ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. 5 ఎకరాల పొలం ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సాగించాలని అన్నారు.

ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు ఇచ్చే సింగిల్ డ్రీఫ్ ను డబుల్ డ్రీఫ్ గా మార్చే అంశం ప్రభుత్వం పరిశీలనలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో,కలెక్టర్ మను చౌదరి అదనం కలెక్టర్ కరీమా అగర్వాల్ నాయుడుపేట చైర్మన్ రాఘవరెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Also Read: MLA Veerlapalli Shankar: ఇదేమి డిప్యుటేషన్ల దందా.. వైద్య శాఖ తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం!

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..