AV Ranganath ( Image Source: Twitter)
తెలంగాణ

AV Ranganath: మోడల్‌గా మాసబ్ చెరువు కింది నాలా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్

AV Ranganath: మాసబ్ చెరువు – దిలావర్‌ఖాన్ – పెద్ద అంబర్‌పేట చెరువులను అనుసంధానించే నాలాను ఒక మోడల్ నమూనాగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మొత్తం 7.50 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నాలా పొడవునా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని, ప్రస్తుతం తగిన వెడల్పుతో నాలాను నిర్మిస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్ వంటి సంబంధిత శాఖలన్నిటితో సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని కమిషనర్ వివరించారు. మాసబ్ చెరువు – దిలావర్‌ఖాన్ చెరువుల మధ్య నాలా సరిగా లేకపోవడం వల్ల అనేక కాలనీలు నీట మునుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి బుధవారం పలు ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాసబ్ చెరువు – దిలావర్‌ఖాన్ చెరువుల మధ్య జాలికుంట పరిసరాల్లో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను, సెల్లార్‌లలోకి నీళ్లు చేరడంతో ఆగిపోయిన నిర్మాణాలను ఆయన పరిశీలించారు.

Also Read: Tummala NageswaraRao: తెలంగాణకు యూరియా సరఫరా.. కేంద్రంతో సంప్రదింపులు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

పూర్తిస్థాయిలో నాలా అభివృద్ధి..

చెరువుల మధ్య అనుసంధానంగా ఉన్న వరద కాలువలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ తెలిపారు. పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణాలు జరగనందున, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నాలాను నిర్మించాలని సూచించారు. అలాగే, చెరువుల ఆక్రమణ జరగకుండా చూడాలని, చెరువులలో మట్టి పోసి నింపిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరువులు, నాలాలను మనం కాపాడుకుంటే వరదలకు ఆస్కారం ఉండదని ఆయన హితవు పలికారు.

Also Read:  Heroine Affairs: పెళ్ళైన హీరోలతో ఆ స్టార్ హీరోయిన్ ఎఫైర్స్.. ఫైర్ అవుతున్న హీరోల భార్యలు?

మాసబ్ చెరువులో మట్టి పోసిన వారిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అనంతరం కర్మాన్‌ఘాట్, బడంగ్‌పేట ఏరియాల్లో నాలా విస్తరణకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు. కర్మాన్‌ఘాట్ ప్రాంతంలోని ఉదయ్ నగర్ కాలనీలో నాలా విస్తరణను వెంటనే చేపట్టాలని సూచించారు. అలాగే రావిర్యాల చెరువును సందర్శించి, చెరువు పైభాగంలో నివాసాలు నీట మునుగుతున్న నేపథ్యంలో చెరువు అలుగులను కమిషనర్ పరిశీలించారు.

Also Read:  Maharashtra Canteen: క్యాంటీన్‌లో ఎమ్మెల్యే లొల్లి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు.. లైసెన్స్ రద్దు!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?