Hydra Ranganath
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

HYDRA: అమీర్‌పేట్ చుట్టుపక్కల వరదల నివారణకు హైడ్రా చర్యలు.. ఏం చేస్తున్నారంటే?

HYDRA: మురుగు రావొద్దు.. నీట మునగొద్దు

ప్రగతి నగర్‌లో ఆక్రమణలను తొలగించాలి
క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్

పూడికతీత పనుల్లో హైడ్రా బిజీ

కృష్ణానగర్ వాసులతో త్వరలో సమావేశం

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: అమీర్‌పేట వద్ద వరద ముప్పు నివారణకు హైడ్రా (HYDRA) చర్యలు కొనసాగుతున్నాయి. సంబంధిత శాఖల సహకారంతో పెద్ద మొత్తంలో మురుగు కాలువల పూడిక తీత పనుల్లో హైడ్రా బిజీగా ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాల్లో పర్యటించి సమస్య పరిష్కారానికి దిశా నిర్దేశం చేయటంతో హైడ్రా పనులను వేగవంతం చేసింది. పనులు జరుగుతున్న ప్రాంతాలు, కృష్ణానగర్‌‌లోని వరద ముప్పు ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మరోసారి పర్యటించారు.

వర్షాల సమయంలో వరద, నిత్యం మురుగు ముంచెత్తే ప్రాంతాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికతీత పనులు, నాలాలను పరిశీలించారు. ఈ నెల 26న పర్యటించి, నాలాల్లో పూడికతీత పనులకు ఆదేశించిన తర్వాత ఆ ప్రాంతాలలో పనులను పర్యవేక్షించారు. స్థానికులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఉన్న అవకాశాలను చర్చించారు. ఇటీవల హైడ్రా వచ్చి పూడికతీత పనులను చేపట్టాక పరిస్థితి కొంతమేర మెరుగుపడిందని, ఈ పనులు కొనసాగించాలని హైడ్రా కమిషనర్‌కు స్థానికులు వినతి సమర్పించారు. త్వరలోనే అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సంబంధిత శాఖలన్నింటితో సమన్వయంగా పని చేసి, వారి సహకారంతో వరద ముంచెత్తకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. మురుగు ముంచెత్తే రహదారుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తామని, పూడికతీత పనులకు సహకరించిన స్థానికులను కమిషనర్ అభినందించారు.

Read Also- Revanth Reddy: కమ్యూనిస్టులపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమీర్ పేట టూ యూసుఫ్ గూడ
భారీ వర్షం పడినప్పుడల్లా నడుము లోతు వరద నీరు నిలవడానికి అమీర్‌పేటలోని మైత్రినగర్ (అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద) చౌరస్తాలో భూగర్భ బాక్స్ డ్రైయిన్లు పూడిపోవడమే కారణమని అక్కడి పరిస్థితిని గమనించి కమిషనర్ రంగనాథ్ భావించారు. జూబ్లీహిల్స్, గాయత్రి హిల్స్, కృష్ణానగర్ ప్రాంతాల నుంచి సారధి స్టూడియో పక్కనుంచి వచ్చే కాలువతో పాటు యూసుఫ్ గూడ, మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి వచ్చే వరద కాలువలు కలిసి అమీర్ పేట వద్ద రోడ్డు దాటుతున్నప్పుడు ఇబ్బందులను కూడా పరిశీలించారు. ఎగువ నుంచి భారీ మొత్తంలో చెత్త కొట్టుకొచ్చి, ఇక్కడ భూగర్భ బాక్సు డ్రైయిన్లు మూడు ఉండగా, వాటిల్లో రెండు పాక్షికంగా, మూడోది మొత్తం పూడ్చకుపోవడాన్ని గమనించారు. శ్రీనివాసనగర్ వెస్ట్ లో బాక్సు డ్రైయిన్ ను ఓపెన్ చేసి పూడిక తీత పనులను పరిశీలించారు. డ్రెయిన్ లైన్లకు భారీ మొత్తంలో అడ్డుపడిన పరుపులు, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు పనులను పర్యవేక్షించారు. అమీర్ పేట ప్రధాన రహదారి కింద ఉన్న బాక్సు డ్రైయిన్ లో పూర్తిగా పూడుకుపోయిన లైనును కూడా క్లియర్ చేయాలని కమిషనర్ ఆదేశించారు.

Read Also- 50 Years for Balakrishna: కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా! ఈ డైలాగ్ రజినీకాంత్ చెబితే!

జూబ్లీ హిల్స్ నుంచి అమీర్ పేట వరకు
జూబ్లీహిల్స్, వెంకటగిరి, కృష్ణానగర్, ఎల్లారెడ్డిగూడ, యూసుఫ్ గూడ, మధురానగర్, శ్రీనివాస్ నగర్, శ్రీనగర్ కాలనీల మీదుగా పారే వరద, మురుగు నీటి కాలువలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కొన్ని చోట్ల 8 మీటర్ల లోతున్న కాలువలు ఆరేడు అడుగుల మేర పూడుకుపోవడాన్ని గమనించారు. కృష్ణా నగర్‌లో ప్రగతినగర్ వద్ద వరద కాలువలను మొత్తం పూడ్చేసి జరిగిన ఆక్రమణలను వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. పైన పేర్కొన్న ప్రాంతాల్లో వరద నీరు నిలువకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పూడికను మొత్తం తొలగించిన తర్వాత వరద సమస్య చాలా వరకు తగ్గుతుందని తాము భావిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. లేని పక్షంలో అన్ని శాఖలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇందులో స్థానికులను కూడా భాగస్వామ్యం చేసి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు. కృష్ణకాంత్ పార్క్ లో ఉన్న చెరువులను కూడా విస్తరించి వరదను హోల్డ్ చేసే విధంగా తీర్చి దిద్దుతామన్నారు. వందేళ్ల వరకూ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కమిషనర్ తన పర్యటనలో స్థానికులు సమస్యలను వివరించారు. ఈ ప్రాంతాల్లో పలుసార్లు కమిషనర్ పర్యటించి సమస్య పరష్కారానికి చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?