VC Sajjanar: పండుగ రోజు పతంగి ప్రియులకు సీపీ మాస్ వార్నింగ్..!
VC Sajjanar (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

VC Sajjanar: పండుగ రోజు పతంగి ప్రియులకు సీపీ మాస్ వార్నింగ్.. అవి దొరికితే దబిడి దిబిడే..?

VC Sajjanar: చైనా మాంజా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నట్టు హైదరాబాద్ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్(VC Sajanar)​ చెప్పారు. జనం ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా అమ్మినా, స్టాక్​ చేసి పెట్టుకున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చైనా మాంజా(China Manja) విక్రయాలకు చెక్ పెట్టటానికి టాస్క్​ ఫోర్స్​ బృందాలు స్థానిక పోలీసులతో కలిసి దాడులు జరుపనున్నట్టు చెప్పారు. సంక్రాంతి పండుగ సమీపించిన నేపథ్యంలో ఇప్పటికే వేలాది మంది గాలిపటాలు ఎగుర వేస్తున్నారు.

ప్రాణాలను కూడా ప్రమాదం

ఇంతవరకు బాగానే ఉన్నా కొంతమంది చైనా మాంజాను ఉపయోగిస్తుండటం ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే వేర్వేరు చోట్లు చైనా మాంజా గొంతుకు చుట్టుకు పోవటం వల్ల ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ యువకునికి 18కుట్లు వేయాల్సి వచ్చింది. ఇక, చైనా మాంజా వల్ల పక్షుల ప్రాణాలను కూడా ప్రమాదం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే చైనా మాంజా విక్రయాలను అరికట్టటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్టుగా కమిషనర్​ సజ్జనార్ చెప్పారు. ఈ మేరకు క్షేత్రస్థాయి సిబ్బందికి ఇప్పటికే సూచనలు జారీ చేసినట్టు తెలిపారు. 1986 పర్యావరణ పరిరక్షన చట్టం ప్రకారం చైనా మాంజా తయారీ, విక్రయం, నిల్వ చేయటం నిషిద్ధమని తెలిపారు. ఈ మాంజా మట్టిలో కలిసిపోక ఏళ్ల తరబడి అలాగే ఉంటుందని చెప్పారు.

Also Read: BIG Academy: గ్రాండ్‌గా ‘బిగ్ అకాడమీ’ ప్రారంభోత్సవం.. రేపు హైదరాబాద్‌కు యువరాజ్ సింగ్

పార్సిల్ సర్వీసులపై నిఘా

చైనా మాంజా తయారీలో ప్లాస్టిక్(Plastic)​ ఇతర సింథటిక్(Sinthtic) పదార్థాలు, గాజు పొడి ఉపయోగిస్తారన్నారు. ఇది మెడకు చుట్టుకుంటే గొంతు తెగిపోతుందన్నారు. ఇక, కొన్నిసార్లు ఇనుప పొడిని కూడా ఈ మాంజా తయారీలో వాడుతున్నారన్నారు. దీనివల్ల మాంజా విద్యుత్ తీగలకు తగిలినపుడు కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. అందువల్లే చైనా మాంజా విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గాలిపటాలు అమ్మే షాపులు, అనుమానాస్పద గోడౌన్ లు, చైనా మాంజాను ఇక్కడికి చేరుస్తున్న ట్రాన్స్​ పోర్ట్ సంస్థలు, పార్సిల్ సర్వీసులపై నిఘా పెంచినట్టు తెలిపారు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా గుర్తించి చైనా మాంజాను వాడవద్దని సూచించారు. ఎక్కడైనా ఈ మాంజా అమ్మకాలు జరుగుతున్నట్టు తెలిస్తే 94906 16555 నెంబర్​ కు సమాచారం ఇవ్వాలని కోరారు. స్థానిక పోలీస్​ స్టేషన్లకు కూడా వివరాలు అందచేయవచ్చని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు.

Also Read: Jupally Krishna Rao: టూరిజం హబ్‌గా తెలంగాణ.. కేరళతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

Just In

01

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు

Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!

Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!

Sathupalli News: సత్తుపల్లి మెడికల్ సిండికేట్ దందా తనిఖీల్లో అనుమానాలు..?