Maoist Ganesh: ఇటీవలనే భద్రతా బలగాల ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు గణేష్(Ganesh) అలియాస్ పాక హనుమంతు(Hanumanthu) మృతదేహం ఆదివారం ఆయన స్వగ్రామం పుల్లెంలకు చేరుకుంది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం లోని చుండూరు మండలం పుల్లెంల గ్రామంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒడిస్సా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పాక హనుమంతు అలియాస్ గణేష్ పార్దివదేహం ఆయన స్వగ్రామానికి చేరుకోవడంతో గ్రామంలో పోలీసులు పహార కాస్తున్నారు.
భారీ సంఖ్యలో పోలీసులు
ఒడిశాలోని కందమాల్ జిల్లా గుమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన సిపిఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ పార్దివదేహాన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన అనంతరం ఆయన స్వగ్రామానికి తరలించారు. ఆయన మృతదేహం గ్రామానికి చేరుకోగానే భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గ్రామ ఎంటర్ అయిన తర్వాత ప్రధాన కూడళ్లలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పోలీసులు చేపట్టారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పోలీసుల పహారా నడుమ గణేష్ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగాయి. అంత్యక్రియలు పోలీసుల పహార మధ్య జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Home Remedies: కడుపు నొప్పితో బాధపడుతున్నారా.. అయితే, ఈ సహజ చిట్కాలతో చెక్ పెట్టేయండి!
గ్రామంలో తండోపతండాలుగా..
గణేష్ పార్తివదేహాన్ని చూసేందుకు సమీప గ్రామాల నుంచి గుంపులు గుంపులుగా ప్రజలు తరలివచ్చారు. ఆయన మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. చిన్ననాటి స్నేహితులు, శ్రేయోభిలాషులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో తండోపతండాలుగా గణేష్ నూతదేహాన్ని చూసేందుకు రావడంతో పోలీసులు కొంత కంగారు పడ్డప్పటికీ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తానికి హై టెన్షన్ వాతావరణం జరుగుతుందనుకున్నప్పటికి అంత్యక్రియలు ప్రశాంతంగా ముగియడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Cylinder Explosion: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్

