High Court: ఆర్టీఐ ఆదేశాలు పాటించలేదని.. హైకోర్టు నోటీసులు
High Court (image credit: swetcha reporter)
Telangana News

High Court: ఆర్టీఐ ఆదేశాలు పాటించలేదని.. ఇలంబర్తి, ఆర్.వీ కర్ణన్‌కు హైకోర్టు నోటీసులు

High Court: ఇచ్చిన ఆదేశాలను పాటించలేదని ఇద్దరు ఐఏఎస్​అధికారులకు హైకోర్టు (High Court) నోటీసులు జారీ చేసింది. వివరాల్లోకెళ్తే శ్యామ్​అనే వ్యక్తి కొన్నిరోజుల క్రితం ఓ అంశానికి సంబంధించిన సమాచారాన్ని కోరుతూ సమాచార హక్కు చట్టం ప్రకారం జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశాడు. అయితే, దీనిపై ఎలాంటి స్పందన రాకపోవటంతో హైకోర్టులో పిటిషన్​వేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు శ్యామ్​అడిగిన సమాచారాన్ని ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, అధికారులు ఈ ఆదేశాలను కూడా పట్టించుకోలేదు.

Also ReadHigh Court: హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఎందుకంటే..?

సమాచారం ఇవ్వటానికి ఇబ్బంది ఏమిటి?

దాంతో శ్యామ్ హైకోర్టు ఆదేశాలు ఉన్నా అధికారులు తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వటం లేదంటూ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. దీనిపై హైకోర్టు జడ్జి జస్టిస్​భీమపాక నగేశ్ గురువారం విచారణ జరిపారు. ఆర్టీఐ ప్రకారం అడిగిన సమాచారం ఇవ్వటానికి ఇబ్బంది ఏమిటి? అని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీకి ఇంతకు ముందు కమిషనర్‌గా పని చేసిన ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్​ఆర్.వీ.కర్ణన్‌లకు నోటీసులు జారీ చేశారు. వీరిపై కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో? వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కేసులో జనవరి 26లోపు కౌంటర్లు దాఖలు చేయాలని సూచించారు. లేనిపక్షంలో వారికి రూ.10వేలు చొప్పున జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Also Read: TG High Court: ట్రాఫిక్ చలాన్లు వేస్తున్నతీరుపై హైకోర్టు సీరియస్!​

Just In

01

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

VH Hanumantha Rao: బీసీ రిజర్వేషన్లపై.. బీజేపీ ఓబీసీ ఎంపీలు మౌనమేల: వీహెచ్ ఫైర్

Lipstick: మీ స్కిన్ టోన్‌కి అద్భుతంగా కనిపించే లిప్ స్టిక్ షేడ్స్.. డే-టు-డే నుండి పార్టీ లుక్ వరకు

New Year Party: న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్.. నగరానికి చేరుస్తున్న పెడ్లర్లు డెడ్​ డ్రాప్​ పద్దతిలో..!

Nagababu Politics: అక్కడ ఫోకస్ పెట్టేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఫోకస్ తగ్గించుకుంటున్న మెగా బ్రదర్..