TG High Court: ట్రాఫిక్ సిబ్బ్ంది తమ సొంత మొబైల్ ఫోన్లతో ఫోటోలు తీస్తూ చలాన్లు వేయటంపై హైకోర్టు (High Court) సీరియస్ అయ్యింది. సెల్ ఫోన్లతో ఫోటోలు తీసి తనకు మూడు చలాన్లు వేశారంటూ రాఘవేంద్ర చారి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. ట్రాఫిక్ చలాన్ ఎన్ ఫోర్స్ మెంట్ విధానంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ హోంశాఖుకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులో ఆదేశించింది.
Also Read: TG High Court: హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్.. విచారణకు హాజరుకాకపోతే..
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
మరోవైపు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి చలాన్లు వేస్తూ ఆ తరువాత అందులో రాయితీలు ఇవ్వటంపై కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చట్ట పరిణామాలపై ఉన్న భయాన్ని బలహీనపరచటమే అని పేర్కొంది. రాయితీలు ఇవ్వటం ట్రాఫిక్ క్రమశిక్షణారాహిత్యాన్ని పెంచుతుందని వ్యాఖ్యానించింది. ఈ చలానా వ్యవస్థలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పేర్కొంటూ జరిమానాలు విధించే వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ దిశలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.
Also Read: TG High Court: స్థానిక ఎన్నికలపై విచారణను వాయిదా వేసిన కోర్టు!

