Heavy Traffic: హైదరాబాద్ నగరవాసి సంక్రాంతికి తమ సొంత ఊర్లకు బయలుదేరారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తూ హైదరాబాదులో స్థిరపడిన వారంతా శుక్రవారం నుంచే ఏపీలోని తమ సొంత ఊర్లకు కార్లలో ఇతర వాహనాల్లో ప్రయాణమయ్యారు. సాధారణ రోజుల్లో హైదరాబాద్_ విజయవాడ జాతీయ రహదారిపై సుమారు 30 వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సుమారు 70 వేల వెహికిల్స్ వెళ్లాయని అధికారులు తెలిపారు. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా(Choutuppal Panthangi Toll Plaza) నుంచి 10 కిలోమీటర్ల మేర రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండగా చిట్యాల వద్ద పెదకాపర్తి, చిట్యాల కూడలిలో ఫ్లై ఓవర్ల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాలు స్లోగా వెళ్తున్న పరిస్థితుల్లో వెహికల్స్ రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ కు 181 కిలోమీటర్లు కాగా పంతంగి, కొర్లపహాడ్, చిల్ల కల్లు టోల్ ప్లాజాల మీదుగా వాహనాలు ఏపీకి వెళ్తున్నాయి.టోల్ ఫీజు చెల్లింపుకు ఫాస్ట్ ట్యాగ్ స్కానింగ్‌లో, వాహనాలను క్రమబద్ధీకరించే విషయమై ఇప్పటికే టోల్ ప్లాజా సిబ్బందికి పోలీసులు అవసరమైన సూచనలు చేశారు.
400 మంది పోలీసులు.. డ్రోన్లతో ట్రాఫిక్ పై ప్రత్యేక నిఘా
హైదరాబాద్_ విజయవాడ జాతీయ రహదారి మీదుగా స్వగ్రామాలకు వెళ్తున్న ప్రయాణికులు సాఫీగా గమ్యం చేరుకునేందుకు వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharath Chandra Pawar) ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయడంతో పాటు సుమారు 400 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. టోల్ ప్లాజా లు, చెక్ పోస్ట్ ల వద్ద పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ డ్యూటీ కంటిన్యూ చేస్తుండగా దాబాలు ఇతర చోట్ల రోడ్లపై వాహనాల పార్కింగ్, ఇతర ట్రాఫిక్ అడ్డంకులను గుర్తించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి తక్షణమే ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఈనెల 9 వ తేదీ సాయంత్రం నుంచి హైదరాబాద్_ విజయవాడ మీదుగా ఏపీకి ప్రయాణికులు వెళ్తున్నది తెలిసిందే. పంతంగి టోల్ ప్లాజ నఃంచి చిట్యాల వరకు వారం రోజుల ముందు నుంచే అవసరమైన ట్రాఫిక్ క్లియరెన్స్‌కు ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
ఇలా వెలితే ఉత్తమం..
ఫెస్టివల్ పూర్తయి తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణికులు వచ్చేవరకు ఎటువంటి ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్ కాకుండా అదనపు ట్రాఫిక్ పోలీసులు, క్యూఆర్ టీ బృందాలు, హైవే పెట్రోలింగ్ వాహనాలతో వారం పాటు బందోబస్తు కంటిన్యూ చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ఒంగోలు, గుంటూరు వెళ్లే ప్రయాణికులు నాగార్జునసాగర్(Nagrjuna Sagar) హైవే మీదుగా వెళ్లాలని, అదేవిధంగా వరంగల్(Warangal) హైవే నుంచి రామన్నపేట మీదుగా చిట్యాలకు చేరుకుంటే సాఫీగా ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా గమ్యస్థానాలకు చేరవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని కోరారు. హైదరాబాద్_విజయవాడ వాహనాల రద్దీపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. అందులో భాగంగా చిట్యాల కూడలిని పరిశీలించినట్లు చెప్పారు.

