TG Cyber Security: చైల్డ్ పోర్నోగ్రఫీ అప్‌లోడ్​ చేస్తున్న ముఠా అరెస్ట్..!
TG Cyber Security (imagecedit:twitter)
Telangana News

TG Cyber Security: చైల్డ్ పోర్నోగ్రఫీ అప్‌లోడ్​ చేస్తున్న ముఠా అరెస్ట్.. నిందితుల్లో ఓ నీటిపారుదల శాఖ ఉద్యోగి..?

TG Cyber Security: రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ ఆపరేషన్​ చేపట్టిన తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చైల్డ్ పోర్న్​ వీడియోలు, కంటెంట్ ను సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్​ చేస్తున్న 24మందిని అరెస్ట్ చేశారు. దాంతోపాటు క్రిమినల్స్​ కు బ్యాంక్​ ఖాతాలు సమకూర్చిన మరో 10మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలిగా సోషల్​ ప్లాట్ ఫాంలలో చైల్డ్ పోర్నోగ్రఫీ, కంటెంట్ ఎక్కువగా అప్ లోడ్​ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఒక్కరోజు స్పెషల్​ ఆపరేషన్ నిర్వహించారు. దీంట్లో భాగంగా 18బృందాలను రాష్ట్రవ్యాప్తంగా రంగంలోకి దింపారు. ఈ బృందాలు పక్కాగా ఆధారాలు సేకరించి ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్న 24మందిని అరెస్ట్ చేశాయి. అరెస్టయిన వారిలో 18నుంచి 48ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు ఉండటం గమనార్హం. ఈ నెట్ వర్క్ లో నీటిపారుదల శాఖలో పని చేస్తున్న ఓ ఉద్యోగి కూడా ఉన్నాడు. పట్టుబడ్డ 24మంది నిందితులపై ఐటీ యాక్ట్​ సెక్షన్​ 67బీతోపాటు పోక్సో చట్టం సెక్షన్​ 15 ప్రకారం కేసులు నమోదు చేశారు.

నాలుగేళ్ల బాలికను..

రాజేంద్రనగర్​ ప్రాంతంలో నివాసముంటున్న కందాడ శ్రీకాంత్​ (24) ఓ ప్రైవేట్​ సెక్యూరిటీ ఏజన్సీలో గార్డుగా పని చేస్తున్నాడు. కాగా, ఓ నాలుగేళ్ల బాలికను అభ్యంతరకరంగా వీడియో రికార్డింగ్​ చేసి దానిని గూగుల్ డ్రైవ్ లోకి అప్ లోడ్​ చేశాడు. ఇక, నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఓ ఉద్యోగి తన వికృతానందం కోసం ఇలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నాడు. టిప్​ లైన్​ ద్వారా అతనిపై ఫిర్యాదులు రాగా స్పెషల్ ఆపరేషన్​‌లో భాగంగా సైబర్​ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితునిపై నిజామాబాద్ సీసీపీఎస్​‌లో కేసులు నమోదయ్యాయి.

Also Read: Rajaiah Slams Kadiyam Srihari: నా అభివృద్ధి నీ ఖాతాలో వేసుకుంటావా? కడియం శ్రీహరిపై రాజయ్య ఫైర్!

మ్యూల్​ ఖాతాలిచ్చి..

ఇక, చైల్డ్ పోర్న్, అబ్యూసీవ్ కంటెంట్​ ను సోషల్​ మీడియాలోకి అప్ లోడ్ చేస్తున్న వారికి బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన మరో 10మందిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. వీరిపై సైబర్​ క్రైం పోలీస్​ స్టేషన్లు, వరంగల్(Warangal)​, రామగుండం(Ramagundam), కరీంనగర్(Karimnagar)లలో కేసులు నమోదయ్యాయి. ఈ పది మంది ఖాతాల ద్వారా 26 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ జరిపిన డైరెక్టర్​ శిఖా గోయల్ తోపాటు దీంట్లో కీలకపాత్ర వహించిన ఎస్పీలు హర్షవర్ధన్, సాయిశ్రీతోపాటు సూర్యప్రకాశ్, కేవీఎం.ప్రసాద్, వెంకటేశ్వర్లు, ఫణీందర్ వెంకట రంగారెడ్డి, గిరికుమార్​, శ్రీనివాసు తదితరులను డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు.

Also Read: RajaSaab Controversy: ‘ది రాజాసాబ్’లో తన మ్యూజిక్ కాపీ కొట్టారంటూ.. చెప్పు చూపించిన స్వీడన్ డీజే..

Just In

01

Jana Sena: జనసేన ఊహించని నిర్ణయం.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సై

Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు

Cyber Fraud: రిటైర్డ్ ఐపీఎస్​ భార్యకు సైబర్ మోసగాళ్ల టోకరా.. ఎంత పని చేశార్రా!

Heavy Traffic: హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ.. డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ

Romeo Juliet Rule: రోమియో జూలియెట్ రూల్.. ‘పోక్సో’ దుర్వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన