Jogulamba Gadwal: గత నెలలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయగా ఇతరులు తనకు అనుకూలంగా ఓటేయలేదని ఆ కుటుంబంలో మృతి చెందిన ఓ వృద్ధురాలి మృతదేహాన్ని తన పొలంలో ఉన్న స్మశాన వాటికలో పూడ్చడానికి అంగీకరించక పోవడంతో జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లాలో తీవ్ర చర్చనీయాంక్షమైంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
గ్రామంలో ఉద్రిక్తత
గట్టు మండలం సల్కాపురం(Salkapuram) గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో బీసీ(BC) సామాజిక వర్గానికి చెందిన ఓ అభ్యర్థి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఎన్నికలలో తనకు ఓటు వేయాలని పలుమార్లు అభ్యర్థించినా పెడచెవిన పెట్టారని ఆ పొలం యజమాని పంతానికి పోయాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొందిఇదిలా ఉండగా గురువారం అదే గ్రామంలో రేషన్ డీలర్(Ration dealer) తల్లి మృతి చెందగా అదే స్మశాన వాటికలో అంతక్రియలు చేశారు. అయితే మరుసటి రోజే సవరమ్మ అనే వృద్ధురాలు మృతిచెందగా అక్కడ అంతక్రియలు నిర్వహించేందుకు భూ యజమాని ససేమిరా అన్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇరు వర్గాల వారీతో మాట్లాడి..
విషయం తెలుసుకున్న ఎస్సై మల్లేష్(SI Mallesh), తహసిల్దార్ విజయ్ కుమార్(Vijay Kumar) తమ సిబ్బందితో గ్రామానికి చేరుకొని ఇరు వర్గాల వారీతో మాట్లాడి అక్కడే అంతక్రియలు నిర్వహించేలా ఆ భూ యజమానిని ఒప్పించారు. గ్రామానికి ఆర కిలోమీటర్ దూరంలో ప్రభుత్వ భూమిలో స్మశాన వాటిక ఏర్పాటుకు మాజీ సర్పంచ్ ఆంజనేయులు(Anjaneyulu) ప్రయత్నించినా గ్రామస్తులు దూరం అవుతుందనే కారణంతో అయిష్టత చూపారు. మున్ముందు ఇలాంటి సమస్యలు పునరావృత్తం కాకుండా ప్రత్యామ్నాయం చూపాలని గ్రామస్తులు అధికారులకు విన్నవించారు.
Also Read: Khammam District: సత్తుపల్లి మెడికల్ దందాపై.. ఏసీబీ విచారణ జరపాలని ప్రజలు డిమాండ్!

