Harish Rao: రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్కార్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పగా, ఇప్పటివరకు కేవలం ఐదారు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలుకు పరిమితమైందని హరీశ్ తెలిపారు. కొనుగోలు చేసిన వడ్లకు కూడా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దాదాపు రూ.1200 కోట్ల వరకు ఎంఎస్పీ బకాయిలు, రూ.200 కోట్ల వరకు బోనస్ పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. మాటల్లో 24 గంటల్లో బోనస్ ఇస్తామని చెప్పినా, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. పోయిన యాసంగి బోనస్ డబ్బులు, ఈ వానాకాలం బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చలిలో రైతులు పడిగాపులు కాస్తున్నారని, వీలైనంత త్వరగా వడ్ల కొనుగోలును వేగవంతం చేయాలని కోరారు. మిల్లులను తక్షణమే టై-అప్ చేయాలని ఆయన సూచించారు.
Also Read: AV Ranganath: బతుకమ్మకుంట బాగుందా? వాకర్లతో ముచ్చటించిన హైడ్రా కమిషనర్!
రైతుల పరిస్థితి దయనీయం
మక్క రైతుల పరిస్థితి రాష్ట్రంలో అత్యంత దయనీయంగా ఉందని హరీశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో మక్కలు పండించారని, ప్రభుత్వం మక్కల కొనుగోలును నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. వెంటనే మక్క రైతులకు డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పత్తి రైతుల పరిస్థితి కూడా ఆగం అయ్యిందని, దీనికి కేంద్రంలోని బీజేపీయే కారణమని విమర్శించారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొంటామనడం అన్యాయమన్నారు. కొన్ని జిల్లాల్లో 11, 12 క్వింటాళ్ల పత్తి పండిందని, మిగిలిన పత్తిని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. జిన్నింగ్ మిల్లులు, కేంద్ర ప్రభుత్వ సీసీఐ పత్తి కొనుగోలు సరిగ్గా చేయడం లేదని, దీంతో పత్తి రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Shubman Gill injury: ఐసీయూలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. డాక్టర్స్ ప్యానల్ ఏర్పాటు
