Minister Sridhar Babu: మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Srideer Babu) మధ్య మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీలో జీరో అవర్లో హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు ప్రభుత్వానికి రథచక్రాల వంటి వారు. వాళ్లు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా చేరుతాయి.. కానీ నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్రమైన మనోవేదనలో ఉన్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంతవరకు పిఆర్సి ఇవ్వలేదు. వెంటనే పిఆర్సి విడుదల చేయాలని కోరుతున్నాను.. గతంలో కేసీఆర్ 43 శాతం, 39 శాతం పిఆర్సి అందించారన్నారు. ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ జీవోను కూడా ఇచ్చామని, కాంగ్రెస్ పార్టీ ఈహెచ్ఎస్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇప్పటికీ అమలు చేయలేదని, రిటైర్డ్ ఉద్యోగులు 39 మంది ప్రభుత్వ బెనిఫిట్స్ అందక మనోవేదనతో మరణించారు… మా హయాంలో 17 వేల మంది ఉద్యోగులు రిటైర్ అయితే అందరికీ టైంకి డబ్బులు అందించాం అన్నారు.
రాష్ట్రంలో లక్ష మంది పోలీసులు
అక్టోబర్ 2024లో రిటైర్ అయితే ఇప్పటివరకు ఒక్క రూపాయి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. హైకోర్టులో కేసు వేసినా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. 35 ఏళ్లు సేవ చేసిన మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి రెండేళ్లు దాటినా అతీగతీ లేదు.. సీపీఎస్ కింద ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను రెండేళ్ల నుంచి దారి మళ్లిస్తున్నారని, దీనివల్ల 2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఐదు సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయి. టీఏ, డీఏలు, స్టేషన్ అలవెన్సులు రావడం లేదు… రాష్ట్రంలో లక్ష మంది పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటిని విడుదల చేసిందన్నారు.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తక్షణమే పీఆర్సీ ఇస్తామని, పెండింగ్ డీఏలు, బకాయిలు ఇస్తామని, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చారు. కానీ రెండేళ్లయినా అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారు. తక్షణమే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కని కోరారు.
Also Read: Panchayat Grants: తెలంగాణ గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. సీఎం కీలక ప్రకటన
ఇప్పుడేమో నీతులు
దీనికి మంత్రి శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. టిఆర్ఎస్ పదేళ్లపాటు ఉద్యోగులను పట్టించుకోలేదని.. ఇప్పుడేమో నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల సంక్షేమం గురించి హరీష్ రావు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అవుతుందన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రతినెల 20వ తేదీ వరకు వేతనాలు ఇచ్చేదని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని.. ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని.. వెల్లడించారు. ఒక సిస్టంతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.
శ్రీధర్ బాబు వర్సెస్ వెంకటరమణారెడ్డి
అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు వర్సెస్ బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మీడియా ముందు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ మనల్ని మనం దిగజార్చుకుంటున్నామని పేర్కొన్నారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీలో సీనియర్ సభ్యులు ఉన్నారు సీనియర్ నేతలు ఉన్నారు.. వారు మర్యాదగా మాట్లాడే ప్రస్తావన తీసుకురావాలని మీ పార్టీ సమావేశాల్లో సూచించాలని.. దాని తర్వాత ప్రస్తావన తీసుకొద్దామని.. నేను ప్రజాస్వామ్యంగా.. మర్యాదపూర్వకంగా.. గౌరవప్రదంగా.. సభ్యుల హుందాతనం పెంచేల కృషి చేస్తానన్నారు. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Also Read: Jr NTR: ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపిన మ్యాన్ ఆఫ్ మాసెస్.. మ్యాటర్ ఏంటంటే?

