Panchayat Grants: తెలంగాణ గ్రామ పంచాయతీలకు తీపి కబురు
Panchayat Grants (imagecredit:twitter)
Telangana News

Panchayat Grants: తెలంగాణ గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. సీఎం కీలక ప్రకటన

Panchayat Grants: నిధులు లేక నీరసించిన పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పంచాయతీల అభివృద్ధికి కొత్త సంవత్సరం కానుకగా స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. చిన్న పంచాయతీలకు రో 5 లక్షలు మేజర్ గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షల నిధులు రానున్నాయి. దీంతో సర్పంచులలో హర్షం వ్యక్తం అవుతోంది.సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పంచాయితీల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తుంది. అయితే గ్రామపంచాయతీలకు రెండేళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో ఆ నిధులు నిలిచిపోయాయి. దీంతో పల్లెలో అభివృద్ధి కుంటుపడింది. చాలా గ్రామాలకు సరైన ఆదాయవనరులు లేక పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ సైతం చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా గ్రామ వీధులలో ఎటుచూసిన మురికినీటిలోనే రవాణా చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రత్యేక పాలన అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేసి అత్యవసర పనులు చేయించారు. ఇటీవల పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంతో నూతన పాలకవర్గాలు కొలువు తీరాయి.

Also Read: Open AI: చాట్‌జీపీటీ మెడకు చుట్టుకున్న యువకుడి మృతి కేసు

నిధులతో అభివృద్ధి పనులకు చేయూత

జిల్లాలోని 255 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా చిన్న పంచాయతీలే ఉన్నాయి. సీఎం పెద్ద పంచాయతీలకు 10 లక్షలు, చిన్న పంచాయతీలకు ఐదు లక్షలు చొప్పున ఇస్తామని ప్రకటించడంతో గ్రామంలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారానికి నూతన సర్పంచ్లకు ఆర్థిక వనరులు తోడయ్యాయి. దీంతో నూతన సర్పంచులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలోని ఖాళీ ఖజానా వెక్కిరిస్తోంది. ఇటీవల బాధ్యతలు చేపట్టే సమయంలో గ్రామాల్లో నిధులు లేకపోవడంతో పలువురు సర్పంచులు పంచాయతీ కార్యాలయాలల్లో సామాగ్రి, ఫర్నిచర్ కొనుగోలు కోసం డబ్బులు వెచ్చించారు. గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. తాగునీటికి సంబంధించిన పైపులైన్ మరమత్తులు, మోటార్ల నిర్వహణకు నిధుల సమస్య ఉంది. ఎస్. డి.ఎఫ్ నిధులు వస్తే కొన్ని పనులు చేయించేందుకు అవకాశం ఉంటుంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జనాభా ఆధారంగా గ్రామపంచాయతీలకు ఏటా నిధులు విడుదల అవుతాయి. వాటిని వివిధ రకాల పనులకు వినియోగిస్తారు. ఇటీవల పాలక మండల్లు రెండు సంవత్సరాలుగా లేకపోవడంతో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో కలిపి మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఫైనాన్స్ నిధులు ఒక సంవత్సరానికి మనిషిపై రూ. 85 చొప్పున గ్రామ జనాభా ప్రాతిపదికన గ్రామపంచాయతీ ఖాతాలలో జమ కానున్నాయి. పంచాయతీ పాలక వర్గాలకు మరింత ఊరట
లభించే అవకాశం ఉంది.

మూడు మార్గాల్లో ఆదాయం

పంచాయతీలకు మూడు రకాల ఆదాయాలు ఉంటాయి. ఇంటి పన్ను, వ్యాపార పన్ను, వారాంతపు సంతల పన్ను, పంచాయతీ స్థలాలు అద్దెకివ్వడం ద్వారా ఆదాయం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ వాటా, భూములకు రిజిస్ట్రేషన్లు, ఆర్థిక సంఘం ద్వారా అభివృద్ధి పనుల కోసం ఇచ్చే సాధారణ గ్రాంట్ల ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తుంది.

Also Read: Lorry Hits Bike: అక్కడికక్కడే అక్కాతమ్ముడి మృతి.. సత్తుపల్లిలో ఘోర ప్రమాదం

Just In

01

Naa Anveshana: అమ్మాయి చీర కట్టు విధానం గురించి కాదు.. అబ్బాయి మైండ్ సెట్ మారాలి.. నా అన్వేష్

CM revanth Reddy: దిగ్విజయ్ సింగ్ vs కాంగ్రెస్.. వివాదంలోకి సీఎం రేవంత్.. నెట్టింట ఆసక్తికర పోస్ట్

Penuballi Land Scam: పెనుబల్లిలో ప్రభుత్వ భూమికి అక్రమ పట్టా కలకలం.. ఎమ్మార్వో పై తీవ్ర ఆరోపణలు

YASANGI App Issues: రైతన్నకు యాప్ కష్టాలు.. యాసంగి ముమ్మరం కాకముందే క్యూ లైన్లు!

Telangana Assembly 2025: సీఎం రేవంత్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్