High Court Website ( IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ

High Court Website: హ్యాక్​ అయిన హైకోర్టు వెబ్ సైట్.. లాగిన్ కాగానే ఆన్​ లైన్​ బెట్టింగ్ సైట్ ఓపెన్!

High Court Website: హ్యాకర్లు ఏకంగా తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ నే హ్యాక్ చేశారు. వెబ్ సైట్ లోకి లాగిన కాగా ఓ ఆన్​ లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ కావటం న్యాయవాదులు కక్షిదారులను ఉలిక్కి పడేలా చేసింది. వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ కార్యాలయ వర్గాలు దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆర్డర్ కాపీలు, కేసుల వివరాలు, తదుపరి విచారణ ఎప్పుడు ఉంది? అన్నవివరాలు తెలుసుకోవటంతోపాటు అధికారిక పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవటానికి న్యాయవాదులు, కక్షిదారులు హైకోర్టు వెబ్ సైట్ లోకి లాగిన్ అవుతుంటారు.

Also Read: High Court Verdict: కల్తీ కల్లు తయారీ కేసుపై.. హైకోర్టు కీలక తీర్పు!

సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు

ఇలాగే పలువురు వెబ్​ సైట్ లోకి లాగిన్ అయ్యారు. అయితే, హైకోర్టు అధికారిక వెబ్ సైట్ కాకుండా బీడీజీ ఎస్ఎల్వోటి అన్న ఆన్ లైన్ బెట్టింగ్ సైట్ ఓపెన్ కావటంతో అందరూ ఖంగు తిన్నారు. ఈ రీ డైరెక్ట్ సమస్యను వెంటనే గుర్తించిన హైకోర్టు రిజిస్ట్రార్​ కార్యాలయవర్గాలు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు రేశాయి. ఇది సాధారణ టెక్నికల్ గ్లిచ్ కాదని…హ్యాకింగే అని హైకోర్టు వర్గాలు భావిస్తున్నాయి.

హ్యాకింగ్​ వెనక వ్యక్తులు ఉన్నారా?

కేసులు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు హ్యాకింగ్​ వెనక వ్యక్తులు ఉన్నారా? లేక ఏదైనా గ్యాంగ్ ఉందా? హ్యాకర్లు సర్వర్ లోకి ఎలా చొరబడ్డారు? సర్వర్ సెక్యూరిటీలో లోపాలు ఉన్నాయా? రీ డైరెక్ట్ కోసం మాల్వేర్ ను ఉపయోగించారా? అన్న అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. దీని కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. హ్యాక్​ అయిన నేపథ్యంలో హైకోర్టు వెబ్ సైట్ కొద్దిసేపు పూర్తిగా యాక్సెస్ కాలేదు. దాంతో న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక, హైకోర్టు టెన్నికల్ టీం, ఐటీ నిపుణులు హ్యాక్​ అయిన మార్గాలను మూసి వేయటం, వెబ్ సైట్ సెక్యూరిటీ ప్యాచ్ లను అప్ డేట్ చేశారు. సర్వర్ ఎన్​ స్ర్కిప్షన్​ ను బలోపేతం చేయటానికి చర్యలు తీసుకున్నారు.

Also Read: TG High Court: సంధ్యా శ్రీ‌ధ‌ర్‌‌ ఆక్రమ‌ణ‌ల‌పై హైకోర్టు సీరియ‌స్‌.. బాధితుల‌కు అండ‌గా ఉంటామని స్పష్టీకరణ!

Just In

01

Amberpet Drug Bust: భారీగా గంజాయి డ్రగ్స్ సీజ్​.. ఎక్సయిజ్ సిబ్బందిపై కత్తులతో దాడికి యత్నం!

Cyberabad Police: ఆడబిడ్డల జోలికొస్తే ఇక మీ పని అంతే.. షీ టీమ్స్ చూస్తున్నాయ్ జాగ్రత్త!

High Court Website: హ్యాక్​ అయిన హైకోర్టు వెబ్ సైట్.. లాగిన్ కాగానే ఆన్​ లైన్​ బెట్టింగ్ సైట్ ఓపెన్!

KTR: భవిష్యత్ లో జూబ్లీహిల్స్ లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తాం : కేటీఆర్

CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీలో విన్ గ్రూప్ పెట్టుబడులు.. సీఎం రేవంత్ తో విన్ గ్రూప్ ఏషియో సీఈవో భేటీ!