High Court Verdict( iamge credit: twitter)
తెలంగాణ

High Court Verdict: కల్తీ కల్లు తయారీ కేసుపై.. హైకోర్టు కీలక తీర్పు!

High Court Verdict: వంద గ్రాములకు మించి మాదక ద్రవ్యాలతో పట్టుబడితే తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయ పడింది. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ఈ అంశాన్ని స్పష్టంగా చెబుతోందని పేర్కొంది. కల్తీ కల్లు తయారీలో ఉపయోగించే 132 కిలోల ఆల్ఫాజోలెంతో దోషిగా తేలిన వ్యక్తి బెయిల్​ కోసం దాఖలు చేసిన పిటిషన్​ పై విచారణ జరిపిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్​ జిల్లా జిన్నారం అనంతారం గ్రామంలోని వెంకట రాఘవ ల్యాబ్స్​ లో బండారు హనుమంత రెడ్డి, వాసంశెట్టి నరేశ్ మరికొందరితో కలిసి ఆల్ఫాజోలెం ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిసి 2018లో దాడి చేశారు.

Also Read: Rajanna Sircilla: ఇదేం పెళ్లిరా బాబూ.. ఇన్ని ట్విస్టులా.. సినిమాల్లోనూ చూడలే!

నిందితులను అరెస్ట్ చేసి 132 కిలో ఆల్పాజోలెంతోపాటు యంత్రాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును విచారించిన సంగారెడ్డి కోర్టు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, దీనిపై వాసంశెట్టి నరేశ్​ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్​ కే.లక్ష్మణ్​ ధర్మాసనం మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం 100 గ్రాములకన్నా ఎక్కువ మాదక ద్రవ్యాలతో దొరికితే తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వటానికి కోర్టులో సుముఖత వ్యక్తం చేయవని వ్యాఖ్యానించింది.

 Also Read: Tummala Nageswara Rao: గిరిజన జిల్లాను అభివృద్ధిలో.. నవ కాంతులతో ముందుకు తీసుకువెళ్తాం!

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు