Indiramma Sarees: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్న మంత్రి
స్వేచ్ఛ, యాదాద్రి భువనగిరి: కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో (Indiramma Sarees) భాగంగా… మెప్మా ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మి నరసింహా ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య , జిల్లా కలెక్టర్ హనుమంత రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన గావించి యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో గల స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.98,23,458 వడ్డీ లేని రుణాల చెక్కును అందజేశారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశ పెట్టిందని, రాష్ట్రంలో కోట్లాది మంది ఉచిత బస్సు ప్రయాణం చేశారని, అందుకుగాను ప్రభుత్వం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తుందని ప్రస్తావించారు.
Read Also – Harish Rao Interrogation: ఉదయం నుంచి ఇంకా సిట్ విచారణలోనే హరీష్ రావు.. బీఆర్ఎస్‌లో ఆందోళన!
ధనిక కుటుంబ సభ్యులు ఎలాంటి బియ్యం తింటున్నారో అవే సన్న బియ్యం ప్రతిపేద ప్రజలు కడుపు నిండా తినాలనే లక్ష్యంతో మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని మంత్రి ప్రస్తావించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో అర్హులైన 16,152 మందికి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో మహిళలు ఆర్థికంగా , బలోపేతం చేయడం కోసం పెట్రోల్ బంకులు కూడా మహిళల పేరున ఇస్తున్నామన్నారు. ప్రతి పేద వారు సొంత ఇంట్లో ఉండాలనే గొప్ప లక్ష్యంతో ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. యాదగిరిగుట్ట తో పాటు యాదగిరిగుట్ట టౌన్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అందుకోసం 100 కోట్లతో యాదగిరిగుట్టలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలో చేపట్టడం జరుగుతుందన్నారు. కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. యాదగిరిగుట్టలో 210 కోట్ల వ్యయ తో చేపట్టిన పైప్ లైన్ పనులు త్వరలో పూర్తి కావొస్తున్నందున ప్రతి ఇంటికి గోదారి జలాలు అందుతాయన్నారు. గంధమల్ల రిజర్వాయర్ ప్రాజెక్ట్ పూర్తి అయితే పరిసర ప్రాంతాలకు , రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ…మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజాపాలన ప్రజా ప్రభుత్వ ఉద్దేశమని, అందులో భాగంగానే వడ్డీ లేని రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు.ప్రతి ఆడ బిడ్డకు పుట్టింటి సారెగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల నుండి 100 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. త్వరలో ఇళ్లు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని, అభివృద్ధి పథంలో యాదగిరిగుట్టను ముందంజలో ఉండాలన్నారు.అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కు గాను వివిధ బ్యాంకులు మరియు శ్రీనిధి వారి సహకారంతో 87 సంఘాలకు రూ.12,73,00,000 బ్యాంకు లింకేజి చెక్కును స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, మెప్మా, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

