Promotion Video at Tirumala: టీటీడీని మళ్లీ టార్గెట్ చేసిన వైసీపీ!
Promotion video being recorded near Tirumala temple raising questions over TTD security
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Promotion Video at Tirumala: టీటీడీ పాలకవర్గాన్ని మళ్లీ టార్గెట్ చేసిన వైసీపీ!.. వైరల్‌గా మారిన వీడియో!

Promotion Video at Tirumala: సందు దొరికితే చాలు!. కాదు కాదు.. అవకాశం లేకపోయినా సరే అధికారపక్షంపై విపక్ష వైసీపీ విరుచుకుపడుతోంది. చిన్న అవకాశం దొరికినా ముప్పేట దాడి చేస్తోంది. అత్యంత సున్నితమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారు, టీటీడీపై రాజకీయాలు చేయబోమంటూనే ఏదో ఒక విషయంలో రచ్చ చేస్తోంది. అలాంటి జగన్ పార్టీ మరొకటి తెరపైకి తీసుకొచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత, టీటీడీ (TTD) పాలనపై ఏపీలో మరోసారి రాజకీయ సెగ రాజుకుంది. ఓ ఇద్దరు యువకులు తిరుమల ఆలయం ముందు రీల్ చేయగా, ఆ వీడియోను చూపిస్తూ టీటీడీ పాలక మండలిని ప్రశ్నించింది. ఏపీలో నిషేధం ఉన్న లాటరీ గురించి ఆ యువకులు ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వైసీపీ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ఈ వీడియోను షేర్ ప్రభుత్వాన్ని (Promotion Video at Tirumala) ప్రశ్నించింది. ఆలయ పవిత్రత ఇలా మంటగలిసిపోతుంటే నిద్రపోతున్నావా బీఆర్ నాయుడు? అని టీటీడీ చైర్మన్‌ను ప్రశ్నించింది.

తిరుమలలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందని, యథేచ్ఛగా రీల్స్ చేస్తున్నారని విమర్శలు గుప్పించింది. కొండపై మొన్న రాజకీయ పార్టీ బ్యానర్‌ను కొంత మంది యువకులు ప్రదర్శించారని, నేడు ఓ ఇద్దరు యువకులు ఎంచక్కా రీల్స్ చేసుకున్నారని టీటీడీపై వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో నిషేధంలో ఉన్న లాటరీని ప్రమోట్ చేస్తూ వీడియో తీశారని పేర్కొంది. శ్రీవారి ఆలయం ముందు ఇంత జరుగుతున్నా విజిలెన్స్ సిబ్బంది కనీసం పట్టించుకోలేదని ఆరోపణలు గుప్పించింది.

Read Also- Educated Couple Begging: భర్త ఎల్ఎల్‌బీ.. భార్య బీకాం కంప్యూటర్స్.. అయినా భిక్షాటనే మార్గం!

రాజకీయ విమర్శలకు వేదికగా టీటీడీ

గత కొంతకాలంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తిరుమల లడ్డూ వ్యవహారం మొదలుకొని, అనేక అంశాలపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజా వివాదంలో, అత్యంత భద్రత, నిఘా ఉండే ఆలయ ప్రాంగణంలో ఇలాంటి వీడియోలు ఏమిటని వైసీపీ ప్రశ్నించింది. అది కూడా చట్టవిరుద్ధమైన లాటరీ అంశాలపై వీడియోలు తీయడం నిబంధనలకు విరుద్దమని మండిపడింది. నిఘా వైఫల్యం జరిగిందని, వేల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాలు ఉండే ఆలయ ముఖద్వారం వద్ద ఇలాంటి వీడియోలు తీస్తుంటే టీటీడీ ఏం చేస్తోందని ఫ్యాన్ పార్టీ ప్రశ్నించింది.

ముఖద్వారం వద్ద కఠిన నిబంధనలు

సాధారణంగా తిరుమల మాడ వీధుల్లో, ఆలయ ముఖద్వారం కఠిన నిబంధనలు ఉంటాయి. ఆ ప్రదేశాల్లో కెమెరాలు, సెల్ ఫోన్లతో వీడియోలు, ఫొటోలు తీయకూడదు. ఆ ప్రదేశాల్లో కచ్చితంగా సెక్యూరిటీ అమలవుతోంది. అయితే, ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు అతిగా ప్రవర్తిస్తున్నారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ తాజా వీడియో వైరల్ కావడం మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చినట్టు అయ్యింది. ఇలా కొనసాగితే భక్తులు సైతం టీటీడీ భద్రతా వ్యవస్థపై సందేహాలు వ్యక్తం చేసే పరిస్థితి రావొచ్చు. వైసీపీ చేసిన ఈ విమర్శలపై టీటీడీ అధికారులు, లేదా ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించ లేదు. వైసీపీ విమర్శల పట్ల స్పందన ఏవిధంగా ఉంటుందో చూడాలి మరి. మొత్తానికి తిరుమల విషయంలో చిన్న పొరపాటు జరిగినా అది రాజకీయంగా దుమారానికి దారితీస్తోందని ఈ ఘటన మరోసారి రుజువు చేసినట్టు అయ్యింది.

Read Also- NTR – Bharat Ratna: ఎన్టీఆర్‌కు భారతరత్న.. ఇంకా ఎంతకాలమీ సాగదీత.. ఈ ప్రశ్నలకు సమాధానాలెక్కడ?

Just In

01

Son Kills Mother: వేరే వ్యక్తితో తల్లి సహజీవనాన్ని జీర్ణించుకోలేక దారుణానికి పాల్పడ్డ కొడుకు

Allu Arjun: మెగాస్టార్ సినిమా గురించి ఐకాన్ స్టార్ ఏం అన్నారంటే?.. ఇది సార్ బ్రాండ్..

Bhatti Vikramarka: అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు… డిప్యూటీ సీఎం భట్టి స్పష్టత

Women Empowerment: మహిళల స్వావలంబనే.. కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం.. మంత్రి దామోదర రాజనర్సింహ

Chiranjeevi Fans: తనపై చూపిస్తున్న అభిమానుల ప్రేమకు ఫిదా అయిన మెగాస్టార్.. ఏం అన్నారంటే?