Harish Rao Interrogation: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీష్ రావు విచారణ ((Harish Rao Interrogation) సుధీర్ఘంగా కొనసాగుతోంది. ఉదయం మొదలుకొని ఇప్పటివరకు 7 గంటలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. విచారణ ఎప్పుడు ముగుస్తుందనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు. దీనిపై సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. అయితే, కేవలం ఒక సాక్షిగా పిలిచి 7 గంటలపాటు స్టేషన్‌లో ఉంచడంపై బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విచారణ పేరుతో పోలీసుల ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తమ నాయకుడి పరిస్థితి ఏంటని అడిగిన బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే హరీష్ రావును బయటకు పంపాలని న్యాయవాదులు, బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్నాయి.
Read Also- Women Empowerment: మహిళల స్వావలంబనే.. కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం.. మంత్రి దామోదర రాజనర్సింహ
శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసుల దురుసు ప్రవర్తనతో ఉద్రిక్తత చెలరేగిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది సోమ భరత అన్నారు. ‘‘హరీష్ రావు డయాబెటిక్ ఉంది. ఆయనను ఇంతసేపు విచారించడం అన్యాయం. రెండు సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తోంది. ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేశారు. మొదటి ఛార్జ్‌షీట్, రెండవ ఛార్జ్ షీట్ వేశారు. సుప్రీంకోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. అరెస్ట్ అయినవారు బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు. ఏ కారణం లేకుండా సిట్ పేరుతో హరీష్ రావుని సాక్షికింద రమ్మన్నారు. బాధ్యతగల వ్యక్తిగా నోటీసులు ఇవ్వగానే సిట్ ముందు హాజరయ్యారు. 6 గంటలుగా విచారిస్తున్నారు’’ అని సోమ భరత అన్నారు.
Read Also- Jurala Project: జూరాల ప్రాజెక్టు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం వద్దకు వెళ్లిన మంత్రి శ్రీహరి

