Jangaon district: ప్రకృతిని ఒడిసి పట్టుదాం.. ఆర్ధికంగా ఎదుగుదాం
ఓబుల్ కేశవాపూర్‌లో ఇంటింట సోలార్
జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, స్వేచ్ఛ: సర్కారు చేస్తున్న సాయంతో సోలార్ వెలుగులను పొందేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని జనగామ జిల్లా (Jangaon district) కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సౌర శక్తి వినియోగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు తెలంగాణ సర్కారు కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుందని, దీంతో ప్రభుత్వానికి విద్యుత్ బిల్లులు భారీగా ఉంటున్నందున సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేస్తే భారీగా ఇంధన ఖర్చులు, వినియోగం తగ్గుతుందని పేర్కొన్నారు. ఆ దిశగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనాల నుంచి జిల్లా కలెక్టరెట్ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రభుత్వ భవనాలతో పాటు, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ భవనాలపై కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నామని అన్నారు.

ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన వైశాల్యం, నెలకు విద్యుత్ వినియోగం వంటి వివరాలను జిల్లాలోని మూడు మండలాల నుంచి తెప్పించామని, మిగతా మండలాల నుంచి రేపటిలోగా నివేదికలు వస్తాయని అన్నారు. జిల్లాలో మొత్తం 1,248 ప్రభుత్వ భవనాల్లో సోలార్ ఏర్పాటుకు అంచనా వేశామని, 43.58 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తితో 3,55,480 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునేలా త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. నెలకు రూ.18 లక్షల కరెంట్ బిల్లులు ఆదా అవుతాయని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు ఒకే తరహాలో నిర్మించినందున వాటిపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రస్థాయిలోనే డిజైన్ తయారవుతుందన్నారు.
సోలార్ ప్లాంట్‌తో పర్యావరణానికి మేలు, పునరుత్పాదక శక్తి లభ్యత, తక్కువ నిర్వహణ ఖర్చులు, విద్యుత్ బిల్లుల్లో ఆదా, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనం ఉందన్నారు. ప్రభుత్వ భవనాలతో పాటు, సౌర శక్తి వినియోగించేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం సబ్సీడి ఇస్తుందని, ఆధిక ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు. జనగామ జిల్లాలోని ఎర్ర గొల్ల పహాడ్, అజ్మీరతండా, ఉస్తేపుగూడెం, మణికట్టుగూడెం లో 100 ఇళ్లకు 100 వీధి దీపాలు, జడ్పీ స్కూల్ లో 2కిలోవాట్స్, సోలార్ ప్లాంట్గ్ట్, గ్రామ పంచాయతీ కి 100 వీధి దీపాలు, వాటర్ ట్యాంక్ కి రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశామని అన్నారు.
Read Also- Maoist Dump: కూంబింగ్ ముగించుకొని వెళ్తున్న బలగాల కంటపడ్డ ఆయుధ డంప్
ఓబుళ కేశవపూర్ లో మెయిన్ రోడ్ నుండి ఊరికి ప్రత్యేకంగా ఎస్సీ కాలనీ కి 100 వీధి దీపాలు, బాలాజీ గుడికి, వెటర్నరి, రైతు వేదిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు, గ్రామ పంచాయతీ, హై స్కూల్, ఎస్సీ కమ్యూనిటీ హల్, చర్చ్ కి రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ లను యూత్ అఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ స్టేట్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా సోలార్ వెలుగులతో గ్రామం దేధీప్యమానంగా వెలుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన్ పథకం కింద గృహలలో రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం 1కిలోవాట్ వ్యవస్థకు రూ. 30,000 సబ్సిడీ, 2కిలోవాట్స్ వ్యవస్థలకు రూ. 60,000 మరియు 3కిలోవాట్స్, అంతకంటే ఎక్కువ వ్యవస్థలకు రూ.78,000 సబ్సిడీ ఇస్తుందన్నారు. జిల్లా లో ఇప్పటి వరకు 230 మంది దరఖాస్తు చేసుకున్నరన్నారని వారికి త్వరలో సోలార్ ప్లాంట్స్ మంజూరు చేసి భిగిస్తామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని, ఆర్ధికంగా ముందడుగు వేయాలని సూచించారు.
Read Also- Sitarama Project: సీతారామ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వాల నిర్లక్ష్యం.. తెలంగాణ రైతు సంఘం ఆగ్రహం