Maoist Dump:
సుక్మా: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలు చేపడుతున్న మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. నక్సల్స్ కోసం జల్లెడపడుతున్న సాయుధ దళాలు మావోయిస్టులకు చెందిన భారీ ఆయుధ డంప్ (Maoist Dump) కనిపించింది. దీనిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుక్మా జిల్లా కొహకామెటా అటవీప్రాంతంలో ఈ డంప్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి.
Read Also- Ganesh Chaturthi: పర్యావరణహిత వినాయక చవితి జరపండి.. జన విజ్ఞాన వేదిక సూచన
మావోయిస్టులు దాచి ఉంచిన ఈ డంప్‌లో ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రి ఉన్నాయి. వీటన్నింటినీ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ నిర్వహించుకొని, తిరిగి వెళుతున్న క్రమంలో బలగాలు డంప్‌ను గుర్తించాయి. ఆయుధ డంప్‌ను స్వాధీనం చేసుకున్న విషయాన్ని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చాహ్న అధికారికంగా నిర్ధారించారు. డంప్ స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారికంగా మీడియాకు వెల్లడించారు.
Read Also- Sitarama Project: సీతారామ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వాల నిర్లక్ష్యం.. తెలంగాణ రైతు సంఘం ఆగ్రహం
మావోయిస్టు డంప్ అంటే ఏంటి?
మావోయిస్టులు తమ కార్యకలాపాల కోసం ఉపయోగించే ఆయుధాలు, పేలుడు పదార్థాలు, కమ్యూనికేషన్ పరికరాలు, ఔషధాలు, నిత్యావసర సరుకులు వంటి వస్తువులను అటవీ ప్రాంతాల్లో రహస్యంగా దాచే స్థలాన్ని మావోయిస్టు డంప్ అంటారు. ఇవి సాధారణంగా జనసంచారం చాలా తక్కువగా ఉండే దట్టమైన అడవులు, పొదల మధ్య, గుట్టల్లో ఏర్పాటు చేసుకుంటారు. మావోయిస్టు కార్యకలాపాలు ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే జరుగుతుంటాయి కాబట్టి, అక్కడే తమ అవసరాల కోసం ఈ డంప్‌లను భద్రపరుచు కుంటారు. ఈ డంప్‌లను గుర్తించి, స్వాధీనం చేసుకోవడం భద్రతా బలగాల కృషిలో భాగమని చెప్పుకోవాలి. ఎందుకంటే, డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకుంటే మావోయిస్టుల శక్తి కొంతమేర తగ్గిద్దనడంలో ఎలాంటి సందేహం లేదు. డంప్‌లలో సాధారణంగా తుపాకులు, బాంబులు, ల్యాండ్‌మైన్స్, బ్యాటరీలు, టైమర్‌లు, నక్సల్ సాహిత్యం మొదలైనవి ఉంటాయి. సాధారణంగా కూంబింగ్ ఆపరేషన్లలో మాత్రమే ఇవి వెలుగుచూస్తుంటాయి.
