GHMC ( IMAGE credit: TWITTER)
తెలంగాణ

GHMC: కరెంటు బిల్లు భారానికి చెక్.. సోలార్ స్ట్రీట్ లైట్లపై బల్దియా కసరత్తు

GHMC: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థగా పేరుగాంచిన జీహెచ్ఎంసీ (GHMC) ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే వీలు లేకపోవటంతో క్రమంగా ఆర్థిక భారాన్ని తగ్గించుకునే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ అందిస్తున్న అత్యవసర పౌర సేవల్లో ఒకటైన స్ట్రీట్ లైట్ మెయింటనెన్స్ శాశ్వత ప్రాతిపదికన తక్కువ ఖర్చుతో సాగేందుకు వీలుగా సిటిలోని అన్ని ప్రాంతాల్లో ప్రస్తుతమున్న స్ట్రీట్ లైట్లు ఇకపై సోలార్ పవర్ తో వెలిగేలా మార్గాన్ని అన్వేషిస్తున్నారు.

 Also Read: Meena: ఎవరు విడాకులు తీసుకున్నా.. పెళ్లి నాతో చేసేవారు.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్

జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని 30 సర్కిళ్లలో కలిపి మొత్తం దాదాపు 5 లక్షల పై చిలుకు స్ట్రీట్ లైట్లుండగా, ఇటీవలే మెరుగైన నిర్వహణ కోసం సుమారు 4 లక్షల 77 వేల 424 స్ట్రీట్ లైట్లకు అయిదేళ్లు నిర్వహణ బాధ్యతల కోసం రూ. 693 కోట్లతో చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లను ఆహ్వానించింది. ఇందుకు మెరుగైన మెుయింటనెన్స్ విధానాలతో అయిదు పేరుగాంచిన సంస్థలు ముందుకు రాగా, ఆ సంస్థలకు టెండర్ల ప్రక్రియను నిర్వహించి బాధ్యతలను అప్పగించేందుకు అనుమతి కోరుతూ జీహెచ్ఎంసీ అనుమతి కోసం సర్కారుకు పంపగా, కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోని స్ట్రీట్ లైట్లకే కాకుండా ఓటర్ వరకున్న 20 స్థానిక సంస్థలు, 7 కార్పొరేషన్లలోని సుమారు రెండున్నర లక్షల స్ట్రీట్ లైట్లకు కలిపి నిర్వహణ బాధ్యతలను బల్దియాకే అప్పగిస్తున్నట్లు సర్కారు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

సిటీలోని స్ట్రీట్ లైట్ల వివరాలు

జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోని 650 కి.మీ.ల విస్తీర్ణంలో సుమారు 3 లక్షల 90 వేల 251 స్తంభాలపై దాదాపు 8 వేల 733 కిలోమీటర్ల పొడువున విద్యుత్ వైర్లున్నాయి. దాదాపు 4 లక్షల 77 వేల 424 స్ట్రీట్ లైట్లున్నాయి. వీటి నిర్వహణకు మొత్తం 24 వేల 840 సెంట్రల్ కమాండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీసీఎంఎస్) బాక్సులున్నాయి. వీటిలో ఆటోమెటిక్ గా సాయంత్రం ఆరు గంటలకు ఆన్ అయి ఉదయం ఆరు గంటల వరకు లైట్లు వెలిగేలా, ఆఫ్ అయ్యేలా 6 వేల 786 టైమర్ బోర్డులున్నాయి.

నెలకు రూ.8 కోట్ల కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకునేందుకు..

రోజురోజుకి జీహెచ్ఎంసీ(GHMC) లో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చటంతో జీతాలు, పెన్షన్ల చెల్లించటం కష్టతరం కావటంతో పాటు కనీసం రొటీన్ మెయింటనెన్స్ కూడా గగనంగా మారుతున్న నేపథ్యంలో స్ట్రీట్ లైట్లకు ప్రతి నెల కరెంటు బిల్లులుగా చెల్లిస్తున్న సుమారు రూ.8 కోట్లు మిగిలేలా సిటీలోని లైట్లన్నీ సోలార్ తో వెలిగేలా ప్లాన్ చేసుకోవాలని సర్కారు సూచించినట్లు సమాచారం. దీంతో సిటిలోని మొత్తం స్ట్రీట్ లైట్లన్నింటికీ సోలార్ ప్లేట్లను అమర్చి, అవి వెలిగేలా చేసే సాధ్యాసాధ్యాలను అంఛన వేసేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టినట్లు తెలిసింది.

జీహెచ్ఎంసీ అధికారులు సైతం కసరత్తు

సిటీలోని స్ట్రీట్ లైట్లన్నింటినీ సోలార్ తో వెలిగేలా చేస్తే జీహెచ్ఎంసీ (GHMC)పై కరెంటు బిల్లుల ఆర్థిక భారం శాశ్వతంగా తగ్గించుకోవచ్చునన్న ఆలోచనతో గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో అప్పటి కమిషనర్ ఆమ్రపాలి ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించే బాధ్యతలను ఉస్మానియా యూనివర్శిటీ విభాగానికి అప్పగించారు. ఆ తర్వాత మూలనపడ్డ ఈ విషయాన్ని తాజాగా సర్కారు తెరపైకి తేవటంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు సైతం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. సోలార్ లైట్లపై ఇప్పటి వరకు సర్కారు మౌఖికంగా ఇచ్చిన ఆదేశాలు కాస్త లిఖితపూర్వకంగా వచ్చే లోపు స్టడీ పూర్తి చేసుకుని ఓ నిర్ణయానికి రావాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత ప్రైవేటు కంపెనీల నుంచి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లను ఆహ్వానించి ఔటర్ వరకున్న మొత్తం స్ట్రీట్ లైట్ల మెయింటనెన్స్ బాధ్యతలను నిర్వర్తించే దిశగా జీహెచ్ఎంసీ సిద్దమవుతున్నట్లు సమాచారం.

 Also Read: Hydraa: ఇంకా కానరాని జాడ.. నాలాల్లో గ‌ల్లంతైన‌వారి కోసం కొనసాగుతున్న చర్యలు

Just In

01

Batukamma Festival: పువ్వులను పూజించే సంప్రదాయం.. వైద్యశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

UPI Miracle: భార్య ఫోన్ పోయిందనుకున్న వ్యక్తికి ‘యూపీఐ మిరాకిల్’

Bommala koluvu: దసరా పండుగ ప్రత్యేకం.. పల్లెల్లో బొమ్మల కొలువు సాంప్రదాయాలకు నెలవు

India vs Pakisthan: మెున్న హారీస్ రౌఫ్.. ఇప్పుడు పాక్ మహిళా క్రికెటర్.. నెట్టింట చెత్త పోస్ట్!

Huzurabad Hospital: హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు.. డాక్టర్ కృష్ణ ప్రసాద్ పిలుపు